బుమ్రా ఖాతాలో అరుదైన ఘనత

టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ ఐసీసీ ప్రపంచకప్ 2019లో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ మెగాటోర్నీలో ఇప్పటి వరకు 9 మెయిడెన్ ఓవర్లు వేసిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. అతడి తర్వాతి స్థానంలో ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా అర్చర్ ఉన్నాడు. అర్చర్ ఇప్పటి వరకు 8 మెయిడెన్లు వేశాడు. కాగా, ప్రస్తుతం కివీస్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్ పోరులో ఇప్పటి వరకు 8 ఓవర్లు వేసిన బుమ్రా ఓ మెయిడెన్ వేసి 25 […]

బుమ్రా ఖాతాలో అరుదైన ఘనత
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 09, 2019 | 10:38 PM

టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ ఐసీసీ ప్రపంచకప్ 2019లో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ మెగాటోర్నీలో ఇప్పటి వరకు 9 మెయిడెన్ ఓవర్లు వేసిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. అతడి తర్వాతి స్థానంలో ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా అర్చర్ ఉన్నాడు. అర్చర్ ఇప్పటి వరకు 8 మెయిడెన్లు వేశాడు. కాగా, ప్రస్తుతం కివీస్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్ పోరులో ఇప్పటి వరకు 8 ఓవర్లు వేసిన బుమ్రా ఓ మెయిడెన్ వేసి 25 పరుగులిచ్చి ఓ వికెట్ తీసుకున్నాడు. కాగా, వర్షం కారణంగా మ్యాచ్ ఆగింది. మ్యాచ్ ఆగే సమయానికి కివీస్ ఐదు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది.