నా ఫేవరెట్‌ టీం ఇండియానే: కమ్రాన్‌ ఆక్మల్‌

హైదరాబాద్‌ : టీమిండియా వరల్డ్ కప్‌ ఫైనల్‌కి చేరుకుంటుందన్న అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో పలువురు విదేశీ ఆటగాళ్లు, మాజీ ప్లేయర్స్ ఇండియా టీమ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆశ్యర్యంగా ఈ సారి పాక్ దిగ్గజ ఆటగాళ్లు సైతం భారత్‌పై నమ్మకం ఉంచడం పలవురికి ఆశ్యర్యాన్ని కల్గిస్తోంది. ఇటీవలే రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్..పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించిన నేపథ్యంలో..తన నెక్ట్స్ ఫేవరెట్ భారత్ అని చెప్పి అందర్ని షాక్‌కి గురిచేశాడు. తాజాగా తన ఫేవరేట్‌ జట్టు టీమిండియానేనని […]

నా ఫేవరెట్‌ టీం ఇండియానే: కమ్రాన్‌ ఆక్మల్‌
Follow us

|

Updated on: Jul 09, 2019 | 10:03 PM

హైదరాబాద్‌ : టీమిండియా వరల్డ్ కప్‌ ఫైనల్‌కి చేరుకుంటుందన్న అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో పలువురు విదేశీ ఆటగాళ్లు, మాజీ ప్లేయర్స్ ఇండియా టీమ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆశ్యర్యంగా ఈ సారి పాక్ దిగ్గజ ఆటగాళ్లు సైతం భారత్‌పై నమ్మకం ఉంచడం పలవురికి ఆశ్యర్యాన్ని కల్గిస్తోంది. ఇటీవలే రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్..పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించిన నేపథ్యంలో..తన నెక్ట్స్ ఫేవరెట్ భారత్ అని చెప్పి అందర్ని షాక్‌కి గురిచేశాడు.

తాజాగా తన ఫేవరేట్‌ జట్టు టీమిండియానేనని పాకిస్తాన్‌ వెటరన్‌ కీపర్‌ కమ్రాన్‌ అక్మల్‌ తెలిపాడు.. బుధవారం మాంచెస్టర్‌లోని ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి సెమీస్‌తో కోహ్లి సేననే విజయం సాధించాలని ఆకాంక్షించాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో టీమిండియా సమతూకంగా ఉందన్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు భీకర ఫామ్‌లో ఉన్నారని పేర్కొన్నాడు. ప్రపంచకప్‌ ఆరంభం నుంచి భారత్‌ జట్టే తనకు ఫేవరెట్‌ అని స్పష్టం చేశాడు.