AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohammed Siraj : ఆసియా కప్ జట్టులో మహ్మద్ సిరాజ్‌కు చోటు లేదా? ఈ షాకింగ్ న్యూస్ నిజమేనా?

ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికీ, మహ్మద్ సిరాజ్ ఆసియా కప్ 2025 జట్టులో భాగం కావడం కష్టమే అని ఒక నివేదిక వెల్లడించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో సిరాజ్ భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఓవల్‌లో జరిగిన ఐదవ టెస్టులో అతను అద్భుతమైన ప్రదర్శనతో భారత్‌కు సంచలన విజయాన్ని అందించాడు.

Mohammed Siraj : ఆసియా కప్ జట్టులో మహ్మద్ సిరాజ్‌కు చోటు లేదా? ఈ షాకింగ్ న్యూస్ నిజమేనా?
Mohammed Siraj
Rakesh
|

Updated on: Aug 19, 2025 | 11:17 AM

Share

Mohammed Siraj : టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఆసియా కప్ 2025లో భారత జట్టులో చోటు దక్కించుకునే అవకాశం లేదని ‘క్రిక్‌బజ్’ నివేదిక వెల్లడించింది. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో సిరాజ్ అద్భుత ప్రదర్శన కనబరిచి, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచినప్పటికీ, ఆసియా కప్ జట్టులో అతనికి స్థానం దక్కకపోవచ్చని సమాచారం. ఓవల్‌లో జరిగిన చివరి టెస్టులో సిరాజ్ అద్భుత బౌలింగ్‌తో భారత్‌కు విజయం అందించాడు. అయితే, టెస్ట్ ఫార్మాట్‌లో రాణించినప్పటికీ, టీ20 ఫార్మాట్‌లో అతనికి చోటు దక్కడం కష్టమేనని ఆ నివేదిక పేర్కొంది.

క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఆసియా కప్ జట్టులో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్లకు చోటు ఖాయమని తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా పేరున్న బుమ్రా, భారత పేస్ అటాక్‌ను ముందుండి నడిపిస్తాడు. అర్ష్‌దీప్ సింగ్ కూడా జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. మూడో పేస్ ఆప్షన్‌గా హర్షిత్ రాణా లేదా ప్రసిద్ధ్ కృష్ణలలో ఒకరికి అవకాశం లభించవచ్చని ఆ నివేదిక పేర్కొంది.

భారత పేస్ అటాక్‌కు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా అదనపు బలం. టీ20 ప్రపంచ కప్‌లో కీలకమైన చివరి ఓవర్ వేసి జట్టును గెలిపించిన హార్దిక్, ఆసియా కప్ జట్టులో మరో పేసర్‌గా ఉంటాడు. దీంతో అనుభవజ్ఞుడైన పేసర్ మహ్మద్ షమీకి కూడా జట్టులో చోటు దక్కడం కష్టమేనని ఆ నివేదిక పేర్కొంది. షమీ ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆడాడు.

మరోవైపు, భారత మాజీ క్రికెటర్ చేతన్ శర్మ రాబోయే ఆసియా కప్ 2025లో టీమిండియా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. “సెలక్ట్ అయిన ఆటగాళ్లు దేశంలోనే అత్యుత్తమ ఆటగాళ్లు. ఇంగ్లాండ్‌తో మనం ఆడిన తీరు చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. మనం ఖచ్చితంగా ఆసియా కప్‌ను గెలుస్తాం” అని ఆయన అన్నారు. ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు దుబాయ్, అబుదాబిలో జరగనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..