IPL Mega Auction 2025: రిషబ్ పంత్‌కు రూ. 27 కోట్ల బిడ్.. ఐపీఎల్ ఆక్షన్ లో కోహ్లి అంచనా నిజమైంది
రిషబ్ పంత్ ఐపీఎల్ 2025 వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు, లక్నో సూపర్ జెయింట్స్ రూ. 27 కోట్ల భారీ బిడ్డుతో అతన్ని కొనుగోలు చేసింది. ఈ సందర్భంగా మహ్మద్ కైఫ్ లాంటి క్రికెట్ నిపుణులు బిడ్‌ను సమర్థించుతూ, ఇది జట్టుకు బలమైన వ్యూహాత్మక నిర్ణయం అని వ్యాఖ్యానించారు. విరాట్ కోహ్లి, ముందు టెస్టు మ్యాచ్ సమయంలో, పంత్ భారీ బిడ్డింగ్‌కు కేంద్రబిందువవుతాడని సరదాగా అంచనా వేశాడు, అది నిజమైంది.
మొదటి రోజు జరిగిన ఐపీఎల్ 2025 వేలంలో రిషబ్ పంత్ రికార్డు స్థాయి ధరకు విక్రయమయ్యాడు. ఈ వికెట్ కీపర్-బ్యాటర్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. లక్నో సూపర్ జెయింట్స్ అతడిని ₹27 కోట్ల భారీ బిడ్డింగ్ ద్వారా తమ జట్టులోకి తీసుకున్నారు. ఈ ప్రాముఖ్యమైన వేళ, పంత్‌పై విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
మూడవ రోజు పెర్త్‌లో జరిగిన ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ సమయంలో, రిషబ్ పంత్ మిచెల్ మార్ష్ బౌలింగ్‌ను ఎదుర్కొన్న సమయంలో, నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న కోహ్లీ నవ్వుతూ పంత్ బిడ్డింగ్‌కు సంబంధించి ఒక పెద్ద అంచనాను వ్యక్తం చేశాడు. ఈ రోజు అతను పెద్దగా షార్ట్స్ ఆడాల్సిన పనిలేదు ఎందుకంటే ఇవాళ పెద్ద ధరకు(వేలం) అమ్ముడు పోవచ్చు!” అని కోహ్లీ అలా చెప్పినట్లు వీడియోలో కనపడుతోంది. కొద్ది గంటల్లోనే కోహ్లీ అంచనా నిజమవడంతో, పంత్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా నిలిచాడు.
పంత్‌ను ₹27 కోట్లకు కొనుగోలు చేసినందుకు లక్నో సూపర్ జెయింట్స్‌పై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో గతంలో పనిచేసిన మహ్మద్ కైఫ్, ఈ ఒప్పందంపై మాట్లాడుతూ, “పంత్ జట్టుకు బ్రాండ్ విలువను మాత్రమే కాదు, అనేక కొత్త అవకాశాలను కూడా తీసుకువస్తాడు. ₹21 కోట్ల స్థాయి నుంచి ₹27 కోట్ల వరకు వెళ్ళడం పెద్ద నిర్ణయమే అయినా, అది సమర్థించబడగలిగిన దూకుడు ఉన్న ఆటగాడు” అని పేర్కొన్నారు.
రిషబ్ పంత్ లక్నో జట్టులో చేరడం ఆ ఫ్రాంచైజీకి ఒక నూతన ఉత్సాహాన్ని తెచ్చిందని స్పష్టంగా తెలుస్తోంది. కెప్టెన్సీ బాధ్యతలు పంత్ చేతుల్లో ఉంటే, జట్టు విజయ సాధనలో మరింత బలంగా ఉండగలదని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఈ నిర్ణయం ఐపీఎల్ 2025 సీజన్‌ను మరింత రసవత్తరంగా మార్చేలా కనిపిస్తోంది. అలాగే, శ్రేయస్ అయ్యర్ కూడా 2025 ఐపీఎల్ ఆక్షన్‌లో సంచలనం సృష్టించారు. పంజాబ్ కింగ్స్ (PBKS) ఆయనను ₹26.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.
.@imVkohli is the king of chatter on the field! From light-hearted banter to giving his teammates batting advice, we’re loving every second of it! 😎
📺 #AUSvINDOnStar 👉 1st Test, Day 4, LIVE NOW! #AUSvIND #ToughestRivalry pic.twitter.com/QQM935A7Gf
— Star Sports (@StarSportsIndia) November 25, 2024
Kohli on Stump Mic – ‘ He(Pant) Doesn't Need To Hit Today, He Going Big Anyway (IPL).’ pic.twitter.com/f7nPj6k5ZO
— Aryan (@RishabhInBlood) November 25, 2024