Mumbai Indians vs Royal Challengers Bengaluru Result, ఐపీఎల్ 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 17వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ 3 వరుస పరాజయాల తర్వాత రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. ఆర్‌సీబీపై 197 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 15.3 ఓవర్లలోనే సాధించింది. సూర్యకుమార్ యాదవ్ 17 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా, ఇషాన్ కిషన్ 23 బంతుల్లో అర్థశతకం సాధించాడు. జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో మెరిశాడు.
17వ సీజన్‌లో RCBకి ఇది 5వ ఓటమిగా నిలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా నాలుగో మ్యాచ్‌లో ఓడిపోయింది. వాంఖడే స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. దినేష్ కార్తీక్, ఫాఫ్ డు ప్లెసిస్, రజత్ పాటీదార్ అర్ధశతకాలు సాధించారు. 197 పరుగుల లక్ష్యాన్ని ముంబై కేవలం 3 వికెట్లు కోల్పోయి సాధించింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ ఎలెవన్: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, విల్ జాక్స్, దినేష్ కార్తీక్ (కీపర్), మహిపాల్ లోమ్రోర్, రీస్ టోప్లీ, మహ్మద్ సిరాజ్, వైషాక్ విజయ్‌కుమార్, ఆకాష్ దీప్.
ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, మొహమ్మద్ నబీ, రొమారియో షెపర్డ్, శ్రేయాస్ గోపాల్, గెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ మధ్వల్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..