LSG vs CSK IPL Match Result: రద్దైన లక్నో, చెన్నై గేమ్.. ఈ సీజన్‌లోనే తొలి మ్యాచ్.. పాయింట్ల పట్టికలో మార్పు?
LSG vs CSK IPL Match Result: లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ రద్దైంది. వర్షం కారణంగా మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 19.2 ఓవర్లు మాత్రమే సాగింది. ఆ తర్వాత వర్షం వదలక పోవడంతో.. అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
LSG vs CSK IPL Match Result: ఇండియన్ ప్రీమియర్ లీగ్-16లో చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. వర్షం కారణంగా రద్దయిన ఈ సీజన్‌లో ఇదే తొలి మ్యాచ్ ఇదే. ఓవరాల్ హిస్టరీని పరిశీలిస్తే లీగ్‌లో రద్దయిన ఆరో మ్యాచ్ ఇది.
ఈ మ్యాచ్‌లో ఇరు జట్లూ ఒక్కో పాయింట్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
లక్నోలోని ఎకానా స్టేడియంలో చెన్నై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 19.2 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులు చేసింది. వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది. వర్షం కారణంగా చెన్నైకి 19 ఓవర్లలో 127 పరుగుల సవరించిన లక్ష్యాన్ని కూడా విధించారు. అయితే వర్షం నిర్ణీత సమయం వరకు ఆగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది.
లక్నోలో ఆయుష్ బదోని అత్యధికంగా అజేయంగా 59 పరుగులు చేశాడు. నికోలస్ పూరన్ 20 పరుగులు చేయగా, కైల్ మేయర్స్ 14 పరుగులు చేశాడు.
చెన్నై బౌలర్లలో మొయిన్ అలీ, మహిష్ తీక్షణ, మతిష్ పతిరనా తలో రెండు వికెట్లు తీశారు.
ఇరుజట్లు:
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): కైల్ మేయర్స్, మనన్ వోహ్రా, కరణ్ శర్మ, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్(కీపర్), కృనాల్ పాండ్యా(కెప్టెన్), కృష్ణప్ప గౌతమ్, నవీన్-ఉల్-హక్, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్.
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, MS ధోనీ(కెప్టెన్/కీపర్), దీపక్ చాహర్, మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..