PBKS vs MI Playing XI: టాస్ గెలిచిన ముంబై.. ప్లేయింగ్ 11లో మార్పులతో బరిలోకి..

Punjab Kings vs Mumbai Indians: ఐపీఎల్ 2023లో భాగంగా నేడు డబుల్ హెడర్స్ జరుగుతున్నాయి. తొలి మ్యాచ్‌లో లక్నో వర్సె చెన్నై తలపడుతుండగా.. ఇక రెండో మ్యాచ్‌లో పంజాబ్ వర్సెస్ ముంబై తలపడేందుకు సిద్ధమయ్యాయి.

PBKS vs MI Playing XI: టాస్ గెలిచిన ముంబై.. ప్లేయింగ్ 11లో మార్పులతో బరిలోకి..
Pbks Vs Mi Live
Follow us
Venkata Chari

|

Updated on: May 03, 2023 | 7:23 PM

Punjab Kings vs Mumbai Indians: ఐపీఎల్ 2023లో భాగంగా నేడు డబుల్ హెడర్స్ జరుగుతున్నాయి. తొలి మ్యాచ్‌లో లక్నో వర్సె చెన్నై తలపడుతుండగా.. ఇక రెండో మ్యాచ్‌లో పంజాబ్ వర్సెస్ ముంబై తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ బ్యాటింగ్‌కు సిద్ధమైంది.

పాయింట్ల పట్టికలో పంజాబ్‌కు అగ్రస్థానానికి వెళ్లే అవకాశం..

పంజాబ్ కింగ్స్‌కు పట్టికలో అగ్రస్థానానికి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం పంజాబ్ 10 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. పంజాబ్ ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించి, 4 మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. ఈ సీజన్‌లో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. పంజాబ్ మంచి రన్‌రేట్‌తో గెలిస్తే.. నంబర్‌వన్‌లో ఉన్న గుజరాత్‌తో సమానంగా 12 పాయింట్లు సాధిస్తుంది.

ముంబై గెలిస్తే ప్లేఆఫ్ రేసులో నిలుస్తుంది..

ముంబై ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 4 మ్యాచ్‌ల్లో విజయం, 4 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ముంబై చివరి మ్యాచ్ రాజస్థాన్‌తో ఆడింది. ఇందులో విజయం సాధించింది. ముంబయి గెలిస్తే 10 పాయింట్లు రావడంతో పాటు ముందున్న మార్గం కాస్త సులువవుతుంది.

ఇవి కూడా చదవండి

ముంబై ఇప్పుడు మెల్లగా ఫామ్ లోకి వస్తోంది. సూర్యకుమార్ యాదవ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. అదే సమయంలో టిమ్ డేవిడ్ కూడా గత మ్యాచ్‌లో ముంబైకి క్లాసికల్ ఫినిషింగ్ అందించడం జట్టుకు శుభపరిణామం.

ఇరుజట్లు..

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), కామెరూన్ గ్రీన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, జోఫ్రా ఆర్చర్, పీయూష్ చావ్లా, కుమార్ కార్తికేయ, ఆకాశ్ మధ్వల్, అర్షద్ ఖాన్.

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్(కెప్టెన్), మాథ్యూ షార్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(కీపర్), సామ్ కర్రాన్, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.

ముంబై ఇంపాక్ట్ ప్లేయర్స్: సూర్యకుమార్ యాదవ్, డెవాల్డ్ బ్రీవిస్, విష్ణు వినోద్, రమణదీప్ సింగ్, ట్రిస్టన్ స్టబ్స్.

పంజాబ్ ఇంపాక్ట్ ప్లేయర్స్: నాథన్ ఎల్లిస్, సికందర్ రజా, అథర్వ తైడే, మోహిత్ రాథీ, శివమ్ సింగ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..