AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజస్థాన్‌ టార్గెట్ 188 పరుగులు

ముంబయి: రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ ఐదు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఓపెనర్లు శుభారంభం అందించారు.  కెప్టెన్‌ రోహిత్‌శర్మ(47, 32 బంతుల్లో 6×4, 1×6), క్వింటన్‌ డికాక్‌(81, 52 బంతుల్లో 6×4, 4×6) మొదటి నుంచీ దూకుడుగా ఆడారు. దీంతో వీరిద్దరూ తొలి వికెట్‌కు 96 పరుగులు జోడించి మంచి శుభారంభాన్ని అందించారు. రోహిత్‌ […]

రాజస్థాన్‌ టార్గెట్ 188 పరుగులు
Ram Naramaneni
|

Updated on: Apr 13, 2019 | 7:10 PM

Share

ముంబయి: రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ ఐదు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఓపెనర్లు శుభారంభం అందించారు.  కెప్టెన్‌ రోహిత్‌శర్మ(47, 32 బంతుల్లో 6×4, 1×6), క్వింటన్‌ డికాక్‌(81, 52 బంతుల్లో 6×4, 4×6) మొదటి నుంచీ దూకుడుగా ఆడారు. దీంతో వీరిద్దరూ తొలి వికెట్‌కు 96 పరుగులు జోడించి మంచి శుభారంభాన్ని అందించారు. రోహిత్‌ ఔటయ్యాక క్వింటన్‌ హాప్ సెంచరీ సాధించాడు. తర్వాత సూర్యకుమార్‌(16), కీరణ్‌పోలార్డ్‌ (6) తక్కువ పరుగులకే పెవిలియన్‌ చేరారు. అయితే డికాక్‌, హార్దిక్‌ పాండ్య నిలకడగా ఆడుతూ స్కోర్‌ను ముందుకు నడిపించారు. చివర్లో డికాక్‌, ఇషాన్‌ కిషన్‌(5) ఔటైనా హార్దిక్ పాండ్య(28, 11 బంతుల్లో 1×4, 3×6) బౌండరీలతో చెలరేగి రాజస్థాన్‌ ముందు 188 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించాడు.రాజస్థాన్ బౌలింగ్‌లో ఆర్చర్ 3, కులకర్ణీ, ఉనద్కట్ చెరో వికెట్ తీశారు.

కష్టపడ్డాడు..అనుకున్నది సాధించాడు! డెలివరీ బాయ్‌ టు బిజినెస్‌మేన్
కష్టపడ్డాడు..అనుకున్నది సాధించాడు! డెలివరీ బాయ్‌ టు బిజినెస్‌మేన్
ఆఫీస్ డెస్క్‌పై ఇవి ఉంటే మీ కెరీర్ రాకెట్‌లా దూసుకుపోవడం ఖాయం..
ఆఫీస్ డెస్క్‌పై ఇవి ఉంటే మీ కెరీర్ రాకెట్‌లా దూసుకుపోవడం ఖాయం..
కొండెక్కిన చికెన్‌ ధరలు.. ప్రస్తుతం కిలో ధర ఎంత ఉందంటే?
కొండెక్కిన చికెన్‌ ధరలు.. ప్రస్తుతం కిలో ధర ఎంత ఉందంటే?
ఆ స్టార్ హీరో సినిమాపై అక్కినేని కోడలి ప్రశంసల జల్లు
ఆ స్టార్ హీరో సినిమాపై అక్కినేని కోడలి ప్రశంసల జల్లు
మేకింగ్‌తో రాజమౌళినే ఫిదా చేసిన సినిమా ఏదో తెలుసా?
మేకింగ్‌తో రాజమౌళినే ఫిదా చేసిన సినిమా ఏదో తెలుసా?
శీతాకాలంలో ఈ కూరగాయను పండించండి.. తక్కువ ఖర్చుతో రెట్టింపు ఆదాయం!
శీతాకాలంలో ఈ కూరగాయను పండించండి.. తక్కువ ఖర్చుతో రెట్టింపు ఆదాయం!
మరో ప్లేయర్‌పైనా గంభీర్ పగ పట్టాడా.. వైట్ బాల్ కెరీర్ క్లోజ్?
మరో ప్లేయర్‌పైనా గంభీర్ పగ పట్టాడా.. వైట్ బాల్ కెరీర్ క్లోజ్?
అయ్యో.. పుట్టింట్లో భార్య.. లాడ్జిలో భర్త.. ఆత్మహత్యల వెనక అసలు..
అయ్యో.. పుట్టింట్లో భార్య.. లాడ్జిలో భర్త.. ఆత్మహత్యల వెనక అసలు..
మందారం నీరు తాగడం వల్ల మీ ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మందారం నీరు తాగడం వల్ల మీ ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మీ వాష్ బేసిన్ ట్యాప్‌పై మొండి మరకలు పోవాలా? అద్భుతమైన ట్రిక్స్‌!
మీ వాష్ బేసిన్ ట్యాప్‌పై మొండి మరకలు పోవాలా? అద్భుతమైన ట్రిక్స్‌!