AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: నన్ను క్షమించండి.. ఐపీఎల్‌తో తీవ్రంగా నష్టపోతున్నాం! టీమిండియా క్రికెటర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

ఐపీఎల్‌లో స్పిన్ బౌలింగ్‌కు తీవ్ర నష్టం జరుగుతోందని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశాడు. బ్యాటర్లకు అనుకూలంగా ఉన్న పిచ్‌లు, ఎటాకింగ్ బౌలింగ్‌కు అవకాశం లేకపోవడం వల్ల స్పిన్నర్లు ఇబ్బందులు పడుతున్నారని అన్నాడు. బాల్‌పై ఉమ్ము వేయడంపై నిషేధం ఎత్తివేయడాన్ని హర్భజన్ స్వాగతించాడు, అయితే స్పిన్ బౌలింగ్ కళను కాపాడటానికి స్పిన్నర్లు ధైర్యంగా ఆడాలని సూచించాడు.

IPL 2025: నన్ను క్షమించండి.. ఐపీఎల్‌తో తీవ్రంగా నష్టపోతున్నాం! టీమిండియా క్రికెటర్‌ షాకింగ్‌ కామెంట్స్‌
Ipl 2025
SN Pasha
|

Updated on: Mar 22, 2025 | 10:19 AM

Share

ఐపీఎల్‌ గురించి టీమిండియా మాజీ క్రికెట్‌ హర్భజన్‌ సింగ్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ఐపీఎల్‌తో స్పిన్‌ అనే కళకు తీవ్రమైన నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ ధనాధన్‌ ఫార్మాట్‌లో బ్యాటర్లకు అనుకూలంగా పిచ్‌లు రూపొందిస్తుండటం వల్ల స్పిన్నర్లు వికెట్లు తీయడం కంటే.. రన్స్‌ ఇవ్వకుండా ఉండేందుకే బౌలింగ్‌ వేస్తున్నారు. ఎటాకింగ్‌ బౌలింగ్‌ వేయలేకపోతున్నారు. స్లోగా బౌల్‌ చేసి.. వికెట్లు తీయకుండా.. ఫాస్ట్‌ బౌలర్లలో స్నిన్నర్లు మారిపోతున్నారు.. బాల్‌ను వేగంగా విసిరేస్తున్నారంటూ భజ్జీ అభిప్రాయపడ్డాడు.

బ్యాటింగ్‌కు ఫేవర్‌గా మారుతున్న పరిస్థితుల కారణంగా.. స్పిన్నర్లు పరిమిత పాత్ర పోషించాల్సి వస్తోంది. వైట్-బాల్ ఫార్మాట్‌లో అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా పరిగణించబడే రషీద్ ఖాన్ వంటి ప్రపంచ స్థాయి స్పిన్నర్ కూడా గత సీజన్‌లో సరిగ్గా వికెట్లు తీయడంలో ఇబ్బంది పడ్డాడు. ఈ ధోరణి స్పిన్ బౌలింగ్ కళకు హానికరమని హర్భజన్ హెచ్చరించాడు. ఐపీఎల్‌లో చాలా మంది స్పిన్నర్లు ఫాస్ట్ బౌలర్ల లాగా బౌలింగ్ చేస్తున్నారని చెప్పడానికి నాకు బాధగా ఉంది. వారు బంతిని తిప్పడం లేదు. ఎటాకింగ్‌ బౌలింగ్‌ చేసి, వికెట్లు తీయాలనే ఉద్దేశ్యం వారికి లేదు.

స్పిన్నర్లు కొంచెం ధైర్యంగా ఉండాలి, అవకాశాలు తీసుకోవాలి. బాల్‌ను స్పిన్‌ చేయాలి, ఫ్లైట్‌ చేయాలి, ఛాన్సెస్‌ తీసుకోవాలి అంటూ భజ్జీ పేర్కొన్నాడు. కాగా ఈ ఐపీఎల్‌ సీజన్‌లో బాల్‌పై సాలివా వాడకంపై ఉన్న నిషేధాన్ని బీసీసీఐ ఎత్తేసిన విషయం తెలిసిందే. ఇది కాస్త స్పిన్నర్లకు హెల్ప్‌ చేస్తుంది. కోవిడ్‌ 19 సమయంలో బాల్‌పై ఉమ్ము లేదా లాలాజలం పోయడాన్ని బీసీసీఐ, ఐసీసీ బ్యాన్‌ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ బ్యాన్‌ ఎత్తివేయడాన్ని హర్భజన్ స్వాగతించాడు. ఇది పేసర్లు, స్పిన్నర్లు ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటుందని అన్నాడు.

Follow Us
ఈ 7 కలలు వస్తున్నాయా? ఇక మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయట!
ఈ 7 కలలు వస్తున్నాయా? ఇక మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయట!
ఎరక్కపోయి.. గ్రిల్స్‌లో ఇరుక్కున్న దొంగ..!
ఎరక్కపోయి.. గ్రిల్స్‌లో ఇరుక్కున్న దొంగ..!
చెట్టు కింద గుట్టలుగా నోట్లు.. అసలు నిజం తెలిస్తే..
చెట్టు కింద గుట్టలుగా నోట్లు.. అసలు నిజం తెలిస్తే..
ఇంట్లో ఈ చిత్రాలు పెడితే డబ్బు, అదృష్టం పెరుగుతాయట.. ఏ దిశలో పెట్
ఇంట్లో ఈ చిత్రాలు పెడితే డబ్బు, అదృష్టం పెరుగుతాయట.. ఏ దిశలో పెట్
ఎండతో పనిలేకుండా ఆరు నెలలు నిల్వ ఉండే టమాటో పచ్చడి
ఎండతో పనిలేకుండా ఆరు నెలలు నిల్వ ఉండే టమాటో పచ్చడి
పైసా ఖర్చు లేకుండా చిన్న కుండీలో గుత్తులు గుత్తులుగా పచ్చిమిర్చి
పైసా ఖర్చు లేకుండా చిన్న కుండీలో గుత్తులు గుత్తులుగా పచ్చిమిర్చి
ప్రపంచ కుబేరుల రహస్య సమ్మర్ క్యాంప్.. సాధారణ ప్రజలకు నో ఎంట్రీ..!
ప్రపంచ కుబేరుల రహస్య సమ్మర్ క్యాంప్.. సాధారణ ప్రజలకు నో ఎంట్రీ..!
ఏషియన్ గేమ్స్‌ నుంచి తెలుగోడు.. వన్డే టీం నుంచి పంత్, పాండ్యా ఔట్
ఏషియన్ గేమ్స్‌ నుంచి తెలుగోడు.. వన్డే టీం నుంచి పంత్, పాండ్యా ఔట్
బాల్కనీ నుండి బల్లులను ఎలా వదిలించుకోవాలి?
బాల్కనీ నుండి బల్లులను ఎలా వదిలించుకోవాలి?
ప్లాస్టిక్ దేవతా విగ్రహాలను పూజించవచ్చా..? శాస్త్రాల్లో అసలు ఏం ఉ
ప్లాస్టిక్ దేవతా విగ్రహాలను పూజించవచ్చా..? శాస్త్రాల్లో అసలు ఏం ఉ