AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో ఉన్న ఫ్రిజ్ నుంచి దుర్వాసన.. ఓపెన్ చేస్తే ఒక్కసారిగా..

ఏపీ అన్నమయ్య జిల్లాలోని గోపిదిన్నెలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో రాత్రి నుంచి దుర్వాసన రావడంతో పరిశీలించిన కుటుంబ సభ్యులు ఫ్రిజ్ తలుపు తెరవగానే ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో అక్కా, తమ్ముడితో పాటు నలుగురు గాయపడగా, తీవ్రంగా గాయపడిన ఇద్దరిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఫ్రిజ్ పేలుడుకు గల అసలు కారణాలపై పోలీసులు, అధికారులు దర్యాప్తు చేపట్టారు.

ఇంట్లో ఉన్న ఫ్రిజ్ నుంచి దుర్వాసన.. ఓపెన్ చేస్తే ఒక్కసారిగా..
Fridge Explosion
Raju M P R
| Edited By: |

Updated on: Aug 06, 2026 | 1:27 PM

Share

ఏపీ అన్నమయ్య జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక ఇంట్లో ఉన్న రిఫ్రిజిరేటర్ ఒక్కసారిగా పేలింది. ఇంట్లో ఉన్న రిఫ్రిజిరేటర్ పేలిన ప్రమాదంలో అక్కా, తమ్ముడు సహా.. నలుగురు గాయపడ్డారు. తీవ్రగాయాల పాలైన వారిద్దరినీ ఆసుపత్రికి తరలించారు.. పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. తంబళ్లపల్లి మండలం గోపిదిన్నెలో ఈ ఘటన జరిగింది.

వివరాల ప్రకారం.. గోపిదిన్నె ఎస్సీ కాలనీలో ఉంటున్న శివ కుమార్ ఇంట్లో అర్ధరాత్రి నుంచి దుర్వాసన వస్తుండటాన్ని గుర్తించారు. గ్యాస్ లీక్ అవుతుందేమోనన్న అనుమానంతో ముందుగా గ్యాస్ సిలిండర్ ను చూసారు. సిలిండర్ నుంచి కాదని తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆ తర్వాత రిఫ్రిజిరేటర్ నుంచి దుర్వాసన రావడం గమనించారు. రిఫ్రిజిరేటర్ నుంచి వాసన వస్తుందని పరిశీలించారు. ఈ క్రమంలోనే.. ఫ్రిజ్ డోర్ ఓపెన్ చేశారు.. అది ఓపెన్ చేయడంతోనే ఒక్కసారిగా పేలుడు సంభవించింది.

రిఫ్రిజిరేటర్ పేలుడు ధాటికి ఇల్లు ధ్వంసం అయ్యింది. ఇంట్లోని వస్తువులు చల్లాచెదురు అయ్యాయి.. ఇంట్లో ఉన్న శివ కుమార్, మరదలు పవిత్రతోపాటు ఆమె తమ్ముడు ప్రకాష్ లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ పవిత్ర, ప్రకాష్ లను కాపాడే క్రమంలో శివ కుమార్ తో పాటు అతని భార్య సుస్మిత కూడా స్వల్పంగా గాయ పడ్డారు. గాయపడ్డ నలుగురిని స్థానికులు తంబళ్లపల్లి ఆసుపత్రికి తరలించారు. పవిత్ర, ప్రకాష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం అక్కడి నుంచి మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఫ్రిజ్ ఎందుకు పేలిందన్న విషయం తెలియాల్సి ఉంది.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Follow Us
ఖాళీ కడుపుతో పొరపాటున కూడా ఈ 7 ఆహారాలు తినకండి..
ఖాళీ కడుపుతో పొరపాటున కూడా ఈ 7 ఆహారాలు తినకండి..
పిల్లలు రాసుకునే పలకలు ఎలా తయారవుతాయో తెలుసా..?
పిల్లలు రాసుకునే పలకలు ఎలా తయారవుతాయో తెలుసా..?
కిషోర్ కుమార్ డ్రీమ్ హోమ్..ఇప్పుడు విరాట్ కోహ్లీ వన్8 కమ్యూన్!
కిషోర్ కుమార్ డ్రీమ్ హోమ్..ఇప్పుడు విరాట్ కోహ్లీ వన్8 కమ్యూన్!
టీమిండియాలో నీకు ప్లేస్ లేదంటూ వెళ్లగొట్టారు.. కట్‌చేస్తే..
టీమిండియాలో నీకు ప్లేస్ లేదంటూ వెళ్లగొట్టారు.. కట్‌చేస్తే..
తండ్రి ఆస్తిపై పెద్ద కొడుక్కే ఎక్కువ హక్కు ఉంటుందా?
తండ్రి ఆస్తిపై పెద్ద కొడుక్కే ఎక్కువ హక్కు ఉంటుందా?
అయ్యో పాపం.. కొత్త జంట ముప్పు తిప్పలు.. సీడీలోనే రహస్యం..
అయ్యో పాపం.. కొత్త జంట ముప్పు తిప్పలు.. సీడీలోనే రహస్యం..
IND vs SL: టీమిండియా ప్లేయర్లకు గంభీర్ స్ట్రాంగ్ వార్నింగ్..
IND vs SL: టీమిండియా ప్లేయర్లకు గంభీర్ స్ట్రాంగ్ వార్నింగ్..
గ్యాంగ్‌స్టర్ అతీక్ కుటుంబాన్ని వెంటాడుతున్న విషాదాలు..!
గ్యాంగ్‌స్టర్ అతీక్ కుటుంబాన్ని వెంటాడుతున్న విషాదాలు..!
ఊడిపోతున్న జుట్టుకు మునగాకు నూనె.. వారానికి రెండుసార్లు రాస్తే..
ఊడిపోతున్న జుట్టుకు మునగాకు నూనె.. వారానికి రెండుసార్లు రాస్తే..
అమ్మవారికి సమర్పించే బోనం ఎన్ని రకాలుగా చేస్తారు? ఆ మహత్యం ఇదే!
అమ్మవారికి సమర్పించే బోనం ఎన్ని రకాలుగా చేస్తారు? ఆ మహత్యం ఇదే!