AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ వేలంపై బీసీసీఐ కీలక ప్రకటన.. ఈ సారి భారత్‌లోనే.. ఎక్కడో తెలుసా..?

IPL 2027 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రియులకు బీసీసీఐ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. గత మూడేళ్లుగా విదేశాల్లో సాగిన ఐపీఎల్ వేలం ప్రక్రియ.. ఈసారి తిరిగి స్వదేశానికి చేరుకుంది. పర్యాటక స్వర్గధామం గోవా వేదికగా డిసెంబర్‌లో ఐపీఎల్ 2027 మినీ వేలం నిర్వహించనున్నట్లు బోర్డు సెక్రటరీ దేవజిత్ సైకియా అధికారికంగా ప్రకటించారు. ప్రతి జట్టు వద్ద ఎన్ని కోట్లు ఉండబోతున్నాయి? ఫ్రాంచైజీలు ఎవరిని ఉంచుకుంటాయి.. ఎవరిని వదిలేస్తాయి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఐపీఎల్ వేలంపై బీసీసీఐ కీలక ప్రకటన.. ఈ సారి భారత్‌లోనే.. ఎక్కడో తెలుసా..?
Ipl 2027 Auction To Be Held In Goa This December
Krishna S
|

Updated on: Sep 23, 2026 | 9:08 PM

Share

ప్రపంచంలోనే అత్యంత పాపులర్ క్రికెట్ లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 సీజన్ వేలానికి రంగం సిద్ధమవుతోంది. గత మూడేళ్లుగా విదేశాల్లో జరిగిన ఐపీఎల్ వేలాన్ని ఈసారి మళ్లీ భారత్‌లోనే నిర్వహించబోతున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. పర్యాటక కేంద్రమైన గోవా వేదికగా ఈ ఏడాది డిసెంబర్‌లో ఐపీఎల్ 2027 వేలం జరగనుంది. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఈ కీలక వివరాలను వెల్లడించారు. గతంలో సౌదీ అరేబియా, దుబాయ్, అబుదాబి వంటి అంతర్జాతీయ వేదికలపై మూడు విడతలుగా విజయవంతంగా నిర్వహించిన తర్వాత ఈసారి డిసెంబర్‌లో స్వదేశంలోని గోవాలో ఐపీఎల్ వేలాన్ని ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించిందని ఆయన తెలిపారు.

మినీ వేలం.. పర్స్ లెక్కలివీ

ఈసారి జరగబోయేది మినీ వేలం కావడంతో ఫ్రాంచైజీలు తమ ప్రధాన ఆటగాళ్లను అలాగే అట్టేపెట్టుకునే అవకాశం ఉంది. 2027 సీజన్‌కు సంబంధించి ప్రతి ఫ్రాంచైజీ వద్ద బేస్‌లైన్ పర్స్ విలువ రూ.120 కోట్లుగా ఉండనుండగా, మొత్తం సాలరీ క్యాప్‌ను రూ.157 కోట్లుగా నిర్ణయించారు. అయితే ఆటగాళ్ల కొనుగోలుకు ఫ్రాంచైజీల వద్ద మిగిలే తుది బడ్జెట్ ఎంతనేది రిటెన్షన్ ప్రక్రియ, ప్లేయర్ల విడుదల, ట్రేడింగ్ విండో ముగిసిన తర్వాతే తేలనుంది. మరోవైపు మ్యాచ్‌ ఫలితాలను శాసించే ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను రాబోయే సీజన్‌లో కొనసాగించాలా వద్దా అనే అంశంపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

 మొహాలీకి మారిన మహిళల మ్యాచ్

మరోవైపు భారత్ ఎ ఉమెన్స్, ఆస్ట్రేలియా ఎ ఉమెన్స్ జట్ల మధ్య సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 2 వరకు జరగాల్సిన మల్టీ డే మ్యాచ్ వేదికను ధర్మశాల నుంచి మొహాలీకి మార్చినట్లు బీసీసీఐ ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మైదానం, ఔట్‌ఫీల్డ్ చిత్తడిగా మారి మ్యాచ్ నిర్వహణకు అనుకూలంగా లేకపోవడంతోనే ఈ మార్పు చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం మిగిలిన మ్యాచ్‌లు ఇకపై మొహాలీలోని పీసీఏ ఐఎస్ బింద్రా స్టేడియంలో జరుగుతాయి. ప్రస్తుతానికి ఇరు జట్ల మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు కూడా మొహాలీనే ఆతిథ్యం ఇస్తోంది. తొలి వన్డేలో 236 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి భారత్ ‘ఎ’ మహిళల జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. వాతావరణ పరిస్థితుల వల్ల మ్యాచ్‌లకు ఎలాంటి ఆటంకం కలగకుండా, క్రికెట్ కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడటానికే ధర్మశాల వేదికను మొహాలీకి మార్చినట్లు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.

Follow Us
హైదరాబాద్‌ PVNR ఎక్స్‌ప్రెస్‌వే పై ప్రమాదం.. 5 కార్లు వరుసగా ఢీ!
హైదరాబాద్‌ PVNR ఎక్స్‌ప్రెస్‌వే పై ప్రమాదం.. 5 కార్లు వరుసగా ఢీ!
స్మృతి మంధాన ముందున్న అసలైన పరీక్ష ఇదే
స్మృతి మంధాన ముందున్న అసలైన పరీక్ష ఇదే
డీమార్ట్‌లో ఇలా చేస్తే మీకు పూర్తి రీఫండ్. ఈ చిన్న ట్రిక్‌తో..
డీమార్ట్‌లో ఇలా చేస్తే మీకు పూర్తి రీఫండ్. ఈ చిన్న ట్రిక్‌తో..
ఉప్పల్ బాలు నెల సంపాదన ఎంతో తెలుసా?.. ఒక్క ఇంటర్వ్యూకు ఎంతంటే..
ఉప్పల్ బాలు నెల సంపాదన ఎంతో తెలుసా?.. ఒక్క ఇంటర్వ్యూకు ఎంతంటే..
పాత నాణేలు అమ్మాలనుకున్న వ్యాపారికి సైబర్ షాక్.. రూ.23 లక్షలు..
పాత నాణేలు అమ్మాలనుకున్న వ్యాపారికి సైబర్ షాక్.. రూ.23 లక్షలు..
ఆ హీరో ఇచ్చిన గిఫ్ట్ చూసి కన్నీళ్లు పెట్టుకున జబర్దస్త్ బాబు..
ఆ హీరో ఇచ్చిన గిఫ్ట్ చూసి కన్నీళ్లు పెట్టుకున జబర్దస్త్ బాబు..
నీవు లేక నేను లేను.. 70 ఏళ్ల ప్రేమబంధం ఇలా ముగిసింది..
నీవు లేక నేను లేను.. 70 ఏళ్ల ప్రేమబంధం ఇలా ముగిసింది..
రెమ్యునరేషన్ డబ్బులతో ఆ హీరో ఏం చేస్తాడో తెలిస్తే షాక్ అవుతారు..
రెమ్యునరేషన్ డబ్బులతో ఆ హీరో ఏం చేస్తాడో తెలిస్తే షాక్ అవుతారు..
ఢిల్లీకి బిగ్ షాక్.. ఐపీఎల్‌ 2027కు దూరం కానున్న ఆసీస్ స్టార్స్?
ఢిల్లీకి బిగ్ షాక్.. ఐపీఎల్‌ 2027కు దూరం కానున్న ఆసీస్ స్టార్స్?
ట్రంప్‌కు జెలెన్‌స్కీ షాక్.. రష్యా చమురు కేంద్రాలపై దాడులు..
ట్రంప్‌కు జెలెన్‌స్కీ షాక్.. రష్యా చమురు కేంద్రాలపై దాడులు..