AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSK vs DC IPL 2026 : నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హ్యాట్రిక్ ఓటముల తర్వాత గెలుపు రుచి చూసేనా?

CSK vs DC IPL 2026 : ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్థానం చాలా దారుణంగా మొదలైంది. వరుసగా మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బ్యాలెన్స్ లోపించడం జట్టును దెబ్బతీస్తోంది.

CSK vs DC IPL 2026 : నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హ్యాట్రిక్ ఓటముల తర్వాత గెలుపు రుచి చూసేనా?
Csk Vs Dc Ipl 2026
Rakesh
|

Updated on: Apr 11, 2026 | 9:20 AM

Share

CSK vs DC IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న చెన్నైకి.. నేడు (శనివారం) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగబోయే మ్యాచ్ డూ ఆర్ డై సమస్యగా మారింది. హోమ్ గ్రౌండ్ చెపాక్‌లో జరగనున్న ఈ పోరులో గెలిచి మళ్ళీ ఫామ్ లోకి రావాలని రుతురాజ్ సేన పట్టుదలతో ఉంది. ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్థానం చాలా దారుణంగా మొదలైంది. వరుసగా మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బ్యాలెన్స్ లోపించడం జట్టును దెబ్బతీస్తోంది. ఒకవేళ నేటి మ్యాచ్ లో కూడా ఓడిపోతే, ప్లేఆఫ్స్ కు వెళ్లే అవకాశాలు చాలా క్లిష్టంగా మారుతాయి. అందుకే నేడు సొంత గడ్డపై జరిగే మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యూహాలు రచిస్తున్నాడు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి మంచి ఊపు మీద ఉంది.

ధోనీ, బ్రెవిస్ రీఎంట్రీ ?

సిఎస్కే అభిమానులకు ఒక గొప్ప వార్త ఏంటంటే.. గత కొన్ని మ్యాచ్‌లుగా గాయం కారణంగా దూరమైన ఎంఎస్ ధోనీ, నేడు ఢిల్లీతో జరిగే మ్యాచ్ లో ఆడే అవకాశం ఉంది. అతను ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాస్ అయితే నేరుగా బరిలోకి దిగుతాడు. ధోనీ వస్తే మైదానంలో ఉండే ఆ జోషే వేరు. అలాగే యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ కూడా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడని, అతను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేరితే బ్యాటింగ్ మరింత బలోపేతం అవుతుందని వార్తలు వస్తున్నాయి. సంజూ శాంసన్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా జట్టును ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

హెడ్-టు-హెడ్ రికార్డులు :

ఐపీఎల్ చరిత్రలో చెన్నై, ఢిల్లీ జట్లు ఇప్పటివరకు 31 సార్లు తలపడ్డాయి. ఇందులో చెన్నై పూర్తి ఆధిపత్యం కనబరిచింది.

చెన్నై సూపర్ కింగ్స్ విజయాలు: 19

ఢిల్లీ క్యాపిటల్స్ విజయాలు: 12

చరిత్ర పరంగా చెన్నైకి అప్పర్ హ్యాండ్ ఉన్నప్పటికీ, ప్రస్తుత ఫామ్ పరంగా ఢిల్లీ బలంగా కనిపిస్తోంది. కెఎల్ రాహుల్ గత మ్యాచ్ లో 90 పరుగులతో అద్భుతమైన ఫామ్ లో ఉండగా, లుంగి ఎన్గిడి తన బౌలింగ్ తో బ్యాటర్లను వణికిస్తున్నాడు.

పిచ్ రిపోర్ట్, అంచనా

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్) ఈసారి బ్యాటర్లకు స్వర్గధామంలా మారింది. ఇటీవలే జింబాబ్వేపై భారత్ ఇక్కడ 250కి పైగా పరుగులు చేసింది. కొద్ది రోజుల క్రితం పంజాబ్ కింగ్స్ కూడా చెన్నై నిర్దేశించిన 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇక్కడే ఛేదించింది. కాబట్టి ఈరోజు కూడా భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుని, లక్ష్య ఛేదనకు మొగ్గు చూపవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీ విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
సింగర్ మంగ్లీపై కేసు నమోదు..
సింగర్ మంగ్లీపై కేసు నమోదు..
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
త్వరలోనే ఆ టైం వస్తుంది.. ఇంతకీ మ్యాచ్ తర్వాత వైభవ్ ఏం చెప్పాడు
త్వరలోనే ఆ టైం వస్తుంది.. ఇంతకీ మ్యాచ్ తర్వాత వైభవ్ ఏం చెప్పాడు
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్