AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్‌గా రియాన్ పరాగ్.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్

IPL 2026 : ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రియాన్ పరాగ్ ఎంపికయ్యారు. దీనిపై అశ్విన్ స్పందిస్తూ, తాను రవీంద్ర జడేజా కెప్టెన్ అవుతారని భావించినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. జడేజా లాంటి సీనియర్ ఆటగాడు కెప్టెన్సీ చేస్తే జట్టులో స్థిరత్వం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

IPL 2026 : రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్‌గా రియాన్ పరాగ్.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్
Riyan Parag
Rakesh
|

Updated on: Mar 23, 2026 | 2:42 PM

Share

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభానికి ముందే రాజస్థాన్ రాయల్స్ శిబిరంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. జట్టును సుదీర్ఘకాలం నడిపించిన సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు వెళ్లడంతో, అనూహ్యంగా యువ సంచలనం రియాన్ పరాగ్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది ఫ్రాంచైజీ. ఈ సంచలన నిర్ణయంపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరాగ్‌కు పగ్గాలు ఇవ్వడం వెనుక ఉన్న వ్యూహాన్ని విశ్లేషిస్తూనే, తన మనసులో ఉన్న మరో పేరును బయటపెట్టారు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ ఎంపికపై అశ్విన్ స్పందిస్తూ.. తన మనసులో రవీంద్ర జడేజా పేరు మెదిలిందని కుండబద్దలు కొట్టారు. అంతర్జాతీయ స్థాయిలో, ఐపీఎల్‌లో అపారమైన అనుభవం ఉన్న జడేజా జట్టును నడిపిస్తారని, రియాన్ పరాగ్‌ను వైస్ కెప్టెన్‌గా నియమిస్తారని తాను ఊహించినట్లు అశ్విన్ తెలిపారు. జడేజా లాంటి సీనియర్ ఆటగాడు కెప్టెన్సీ చేస్తే జట్టులో స్థిరత్వం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

పరాగ్‌పై నమ్మకానికి కారణం ఇదే

అయితే, ఫ్రాంచైజీ రియాన్ పరాగ్ వైపు మొగ్గు చూపడం వెనుక బలమైన కారణం ఉందని అశ్విన్ విశ్లేషించారు. అస్సాం జట్టుకు దేశీవాళీ క్రికెట్‌లో పరాగ్ కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. అంతేకాకుండా, గత దశాబ్ద కాలంగా ఐపీఎల్‌లో కొనసాగుతున్న పరాగ్‌కు జట్టు వాతావరణంపై పూర్తి పట్టు ఉంది. రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్ ఏ నిర్ణయమైనా చాలా పక్కాగా, ముందస్తు ప్రణాళికతోనే తీసుకుంటుందని, పరాగ్‌తో సుదీర్ఘ చర్చల తర్వాతే ఈ బాధ్యతలు అప్పగించి ఉండొచ్చని అశ్విన్ పేర్కొన్నారు.

యంగ్ కెప్టెన్ ముందున్న సవాళ్లు

కెప్టెన్‌గా ఎంపికవ్వడం సులభమే కానీ, ఐపీఎల్ లాంటి సుదీర్ఘ టోర్నమెంట్‌లో జట్టును నడిపించడం కత్తిమీద సామేనని అశ్విన్ హెచ్చరించారు. వరుస విజయాలు వచ్చినప్పుడు బాగుంటుంది కానీ, ఓటములు ఎదురైనప్పుడు డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని చక్కదిద్దడం, కోచింగ్ స్టాఫ్‌తో సమన్వయం చేసుకోవడం పరాగ్‌కు పెద్ద పరీక్ష అని చెప్పారు. ముఖ్యంగా తన బ్యాటింగ్ ఫామ్‌ను కాపాడుకుంటూనే, జట్టు వ్యూహాలను అమలు చేయాల్సి ఉంటుందని సూచించారు.

సపోర్ట్ స్టాఫ్, సీనియర్ల అండ

కుమార్ సంగక్కర నేతృత్వంలోని సపోర్ట్ స్టాఫ్ పరాగ్‌కు పెద్ద బలంగా నిలుస్తారని అశ్విన్ ఆశాభావం వ్యక్తం చేశారు. జట్టులో రవీంద్ర జడేజా లాంటి దిగ్గజ ఆటగాడు ఉండటం పరాగ్‌కు కొండంత అండ అని, క్లిష్ట సమయాల్లో జడేజా సలహాలు తీసుకోవడం వల్ల కెప్టెన్సీ భారం తగ్గుతుందని అశ్విన్ చెప్పారు. యువతరం వైపు చూస్తున్న ఫ్రాంచైజీ నమ్మకాన్ని పరాగ్ ఎలా నిలబెట్టుకుంటాడో చూడాలని క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇవాళే OTTలోకి వచ్చేసిన స్పై యాక్షన్ థ్రిల్లర్..IMDBలో 7.1 రేటింగ్
ఇవాళే OTTలోకి వచ్చేసిన స్పై యాక్షన్ థ్రిల్లర్..IMDBలో 7.1 రేటింగ్
గుండు చేయించుకొని ఉపాధి హామీ పనికి వెళ్లిన కూలికి ఊహించని తిప్పలు
గుండు చేయించుకొని ఉపాధి హామీ పనికి వెళ్లిన కూలికి ఊహించని తిప్పలు
రైతన్నలు ఇలాంటి పని అస్సలు చేయొద్దు.. జర్రుంటే ఏం జరిగేదో తెలుసా.
రైతన్నలు ఇలాంటి పని అస్సలు చేయొద్దు.. జర్రుంటే ఏం జరిగేదో తెలుసా.
పె.. ద్ద.. ప్లానే.. నడి రోడ్డుపై మకాం వేసి విషనాగులు.. వీడియో
పె.. ద్ద.. ప్లానే.. నడి రోడ్డుపై మకాం వేసి విషనాగులు.. వీడియో
కేంద్రం షాకింగ్ నిర్ణయం.. NEET రీ-ఎగ్జామ్‌కు ఎయిర్‌ఫోర్స్ సేవలు?
కేంద్రం షాకింగ్ నిర్ణయం.. NEET రీ-ఎగ్జామ్‌కు ఎయిర్‌ఫోర్స్ సేవలు?
జ్యేష్ఠ పౌర్ణమి.. ఈ రోజు చేసే పూజలకు కోటిరెట్లు ఫలితం.. తప్పక..
జ్యేష్ఠ పౌర్ణమి.. ఈ రోజు చేసే పూజలకు కోటిరెట్లు ఫలితం.. తప్పక..
వంకాయ ప్రియులకు బిగ్ అలర్ట్.. ఈ హెచ్చరిక మీ కోసమే..
వంకాయ ప్రియులకు బిగ్ అలర్ట్.. ఈ హెచ్చరిక మీ కోసమే..
భార్య సీమంతం ఫొటోలు షేర్ చేసిన జబర్దస్త్ కెవ్వు కార్తిక్
భార్య సీమంతం ఫొటోలు షేర్ చేసిన జబర్దస్త్ కెవ్వు కార్తిక్
ఫలించిన 20 ఏళ్ల నిరీక్షణ.. కేరళ వాసికి ‘పునర్జన్మ’..!
ఫలించిన 20 ఏళ్ల నిరీక్షణ.. కేరళ వాసికి ‘పునర్జన్మ’..!
తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు
తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు