AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 RCB vs SRH : లైవ్ స్ట్రీమింగ్ నుంచి పిచ్ రిపోర్ట్ వరకు.. బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ పూర్తి వివరాలివే

IPL 2026 RCB vs SRH : మార్చి 28న ఐపీఎల్ 2026 ప్రారంభ పోరులో ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ తలపడనున్నాయి. చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్, పిచ్ రిపోర్ట్, పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

IPL 2026 RCB vs SRH : లైవ్ స్ట్రీమింగ్ నుంచి పిచ్ రిపోర్ట్ వరకు.. బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ పూర్తి వివరాలివే
Ipl 2026 Rcb Vs Srh
Rakesh
|

Updated on: Mar 27, 2026 | 7:22 PM

Share

IPL 2026 RCB vs SRH : ఐపీఎల్ 2026 (IPL 2026) హంగామా మొదలైపోయింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పవర్‌ఫుల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య రేపు (శనివారం, మార్చి 28) అంగరంగ వైభవంగా తొలి మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం ఈ హై వోల్టేజ్ పోరుకు వేదిక కానుంది. గత సీజన్‌లో తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడి చరిత్ర సృష్టించిన ఆర్సీబీ, అదే జోష్‌ను ఈసారి కూడా కొనసాగించాలని పట్టుదలతో ఉంది. మరోవైపు, టీ20 వరల్డ్ కప్ హీరో ఇషాన్ కిషన్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న హైదరాబాద్, తొలి మ్యాచ్‌లోనే బెంగళూరును ఢీకొట్టేందుకు సిద్ధమైంది.

రజత్ పాటిదార్ సారథ్యంలో సరికొత్త ఆర్సీబీ! గత సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో మొదటి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఈసారి రజత్ పాటిదార్ నాయకత్వంలో బరిలోకి దిగుతోంది. గత ఏడాది అంతా తానై జట్టును నడిపించిన పాటిదార్, ఈసారి కూడా అదే ఊపును కొనసాగించాలని చూస్తున్నాడు. అయితే, ప్రధాన పేసర్ జోష్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరం కావడం జట్టుకు కొంచెం లోటే. అయినప్పటికీ హోమ్ గ్రౌండ్ చిన్నస్వామిలో ఆర్సీబీ రికార్డు చాలా బాగుంది. ఇక్కడ బ్యాటర్లకు పిచ్ సహకరిస్తుండటంతో విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి పరుగుల వరద పారడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారి మరింత పటిష్టంగా కనిపిస్తోంది. టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో కీలక పాత్ర పోషించిన ఇషాన్ కిషన్, ఇప్పుడు స్టాండ్-ఇన్ కెప్టెన్‌గా హైదరాబాద్‌ను నడిపిస్తున్నాడు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వంటి విధ్వంసకర ఓపెనర్లు ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు అతిపెద్ద బలం. గత సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరలేకపోయిన బాధను ఈసారి విజయంతో తుడిచిపెట్టాలని ఆరెంజ్ ఆర్మీ పట్టుదలతో ఉంది. ముఖ్యంగా గత ఏడాది ఆర్సీబీపై ఇషాన్ కిషన్ చేసిన 94 పరుగుల వీరబాదుడు అభిమానులకు ఇంకా గుర్తే ఉంది.

లైవ్ స్ట్రీమింగ్, మ్యాచ్ సమయం

ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్ మార్చి 28 (శనివారం) రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. అంతకుముందు 7:00 గంటలకు టాస్ వేస్తారు. ఈసారి ఐపీఎల్ ప్రసార హక్కుల్లో మార్పులు వచ్చాయి. అభిమానులు ఈ మ్యాచ్‌ను టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ద్వారా చూడవచ్చు. మొబైల్ లేదా వెబ్‌సైట్‌లో చూడాలనుకునే వారు జియో హాట్‌స్టార్ (JioHotstar) యాప్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్‌ను వీక్షించవచ్చు. ఇది గతంలో కంటే మెరుగైన యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.

హెడ్-టు-హెడ్, పిచ్ రిపోర్ట్

గణాంకాల పరంగా చూస్తే ఈ రెండు జట్ల మధ్య పోరు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన 25 మ్యాచ్‌లలో హైదరాబాద్ 13 సార్లు విజయం సాధించగా, బెంగళూరు 11 సార్లు గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. ఇక చిన్నస్వామి పిచ్ విషయానికి వస్తే, ఇది బ్యాటర్లకు స్వర్గధామం. బౌండరీలు చిన్నవి కావడంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఫాస్ట్ బౌలర్లకు ప్రారంభంలో కొంచెం స్వింగ్ లభించినా, మ్యాచ్ సాగుతున్న కొద్దీ బ్యాటర్లు ఆధిపత్యం చలాయిస్తారు.

వాతావరణ పరిస్థితి

బెంగళూరు వాతావరణం రేపు క్రికెట్ మ్యాచ్‌కు అనుకూలంగా ఉంది. పగటిపూట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్నా, మ్యాచ్ సమయానికి (రాత్రి) 24 నుంచి 26 డిగ్రీలకు పడిపోయి చల్లగా మారుతుంది. అక్యూవెదర్ రిపోర్ట్ ప్రకారం మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశాలు అస్సలు లేవు. కాబట్టి ఎటువంటి ఆటంకం లేకుండా 40 ఓవర్ల పూర్తి ఆటను మనం ఎంజాయ్ చేయవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us