
Most Fours in IPL 2026: ఈ సీజన్ లో సిక్సర్ల పరంగా అద్భుతమైన పోటీ నెలకొంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లలో వైభవ్ సూర్యవంశీ, సమీర్ రిజ్వీ తమ పవర్ హిట్టింగ్‌తో అభిమానులను అలరిస్తున్నారు. వీరిద్దరూ తలో 11 సిక్సర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న రియాన్ రికెల్టన్ వంద పరుగులు కూడా పూర్తి చేయకుండానే ఏకంగా తొమ్మిది సిక్సర్లు బాదడం విశేషం. బెంగళూరు జట్టు నుంచి రజత్ పాటిదార్, టిమ్ డేవిడ్ సైతం చెరో తొమ్మిది సిక్సర్లతో గట్టి పోటీనిస్తున్నారు.
సమీర్ రిజ్వీ (ఢిల్లీ): 11
వైభవ్ సూర్యవంశీ (రాజస్థాన్): 11
రియాన్ రికెల్టన్ (ముంబై): 9
టిమ్ డేవిడ్ (బెంగళూరు): 9
రజత్ పాటిదార్ (బెంగళూరు): 9
ఫోర్ల వర్షం కురిపిస్తున్న యశస్వి జైస్వాల్..
బౌండరీల పరంగా రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన హవా కొనసాగిస్తున్నాడు. 19 ఫోర్లతో అతను మొదటి స్థానంలో ఉండగా, కోల్‌కతా ఆటగాడు అంగక్రిష్ రఘువంశీ 17 ఫోర్లతో తరువాతి స్థానంలో ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తనదైన శైలిలో ఆడుతూ 16 ఫోర్లు సాధించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సాధారణంగా ఫోర్ల జాబితాలో మొదటి ఐదు స్థానాల్లో ఉండే విరాట్ కోహ్లీ, ఈసారి కనీసం మొదటి 20 మందిలో కూడా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
యశస్వి జైస్వాల్ (రాజస్థాన్): 19
అంగక్రిష్ రఘువంశీ (కోల్‌కతా): 17
సర్ఫరాజ్ ఖాన్ (చెన్నై): 16
సాయి సుదర్శన్ (గుజరాత్): 13
ఫిన్ అలెన్ (కోల్‌కతా): 13
ఐపీఎల్ నిబంధనల ప్రకారం సీజన్ చివరలో అత్యధిక ఫోర్లు, సిక్సర్లు బాదిన ఆటగాళ్లకు ప్రత్యేక పురస్కారాలు అందజేస్తారు. గత ఏడాది సాయి సుదర్శన్ 88 ఫోర్లు కొట్టి పది లక్షల రూపాయల నగదు బహుమతిని గెలుచుకున్నాడు. ఈ ఏడాది కూడా అదే జోరును కొనసాగిస్తూ 13 ఫోర్లతో రేసులో ఉన్నాడు. యువ ఆటగాళ్ల మధ్య నెలకొన్న ఈ పోటీ టోర్నీని మరింత రసవత్తరంగా మారుస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..