IPL 2025: ‘ఆర్సీబీతో మ్యాచ్‌కు నేను రాలేనేమో’! ఫ్యాన్స్ కు షాకిచ్చిన పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా.. ఏమైందంటే?

IPL 2025లో పంజాబ్ జట్టు 7 మ్యాచ్‌ల్లో 5 గెలిచి పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో కొనసాగుతోంది. మొదటి అర్ధభాగంలో బలమైన ప్రదర్శనతో ఆ జట్టు మరింత ఉత్సాహంతో రెండో రౌండ్ పోటీలకు రెడీ అవుతోది. ఆదివారం (ఏప్రిల్ 20) పంజాబ్ జట్టు తన సొంత మైదానం ముల్లన్‌పూర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ ఆడనుంది.

IPL 2025: ఆర్సీబీతో మ్యాచ్‌కు నేను రాలేనేమో! ఫ్యాన్స్ కు షాకిచ్చిన పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా.. ఏమైందంటే?
Preity Zinta

Updated on: Apr 20, 2025 | 1:43 PM

వరుస విజయాలతో దూసుకుపోతోన్న పంజాబ్ కింగ్స్ జట్టు ఆదివారం (ఏప్రిల్ 20) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. తమ సొంత మైదానం ముల్లన్‌పూర్‌లో జరిగే ఈ మ్యాచ్ కోసం పంజాబ్ ఆటగాళ్లు నెట్ లో చెమటోడ్చుతున్నారు. ఇదిలా ఉంటే పంజాబ్ ఆడే ప్రతి మ్యాచ్ కు ఆ జట్టు ఓనర్ ప్రీతి జింటా క్రమం తప్పకుండా హాజరవుతోంది. గెలుపోటములతో సంబంధం లేకుంా గ్యాలరీ నుంచి తమ జట్టు ఆటగాళ్లను నిరంతరం ఎంకరేజ్ చేస్తుంటుంది. అయితే ఆదివారం బెంగళూరుతో జరిగే మ్యాచ్ కు ప్రీతి జింటా రావడం కాస్త అనుమానంగానే ఉంది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. ప్రీతి జింటా తనకు జ్వరం వచ్చిందని ఇందులో చెప్పింది. అందుకే తన తల్లి సంరక్షణ కోసం వస్తోందని అందులో తెలిపింది. ఆర్సీబీతో మ్యాచ్ కోసం హాజరయ్యే అవకాశం లేకపోయినప్పటికీ తన వంతు ప్రయత్నిస్తానని అందులో పేర్కొంది. “నిరంతర ప్రయాణం, తరచూ హోటళ్లు మారడం, విపరీతమైన వేడిలో ఉండటం, ఎయిర్ కండిషనింగ్‌లో గడపడం వల్ల జ్వరం వచ్చింది. తీవ్ర అనారోగ్యంతో ఉండి రాత్రంతా నిద్రపట్టడం లేదు. అదృష్టవశాత్తూ, నా తల్లి నన్ను చూడటానికి వస్తోంది. తదుపరి హోమ్ మ్యాచ్‌ల కోసం ధర్మశాలకు వెళ్లే ముందు చండీగఢ్‌లో ఇది మా చివరి మ్యాచ్ కాబట్టి నేను ముల్లన్‌పూర్ స్టేడియంకు కూడా చేరుకోగలనని ఆశిస్తున్నాను’ అని ప్రీతి తెలిపింది.

ప్లే ఆఫ్ కు బలమైన పోటీ దారుగా పంజాబ్..

శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ జట్టు అద్భుతంగా రాణిస్తోంది. ఈ సీజన్‌లో అందరు ఆటగాళ్లు ఫామ్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. IPL 2025లో, ఈ జట్టు 7 మ్యాచ్‌ల్లో 5 గెలిచి పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉంది. ఈ పట్టును ఇలాగే కొనసాగిస్తే పంజాబ్ జట్టులో ప్లేఆఫ్‌కు చేరుకోవడంతో పాటు టైటిల్ గెలవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.

ఇవి కూడా చదవండి

ప్రీతి జింటా ట్వీట్..

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.