
వాంఖడే స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో 59 పరుగుల తేడాతో విజయం సాధించి.. ప్లేఆఫ్స్‌కి చేరింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 180 పరుగులు చేసింది. ఇక టార్గెట్ చేధించే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 18.2 ఓవర్లలో 121 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై విజయంలో సూర్యకుమార్ యాదవ్, బుమ్రా, శాంట్నర్ కీలక పాత్రలు పోషించారు. సూర్యకుమార్ యాదవ్ 43 బంతుల్లో 73 పరుగులు చేయగా.. బౌలింగ్‌లో శాంట్నర్ 4 ఓవర్లలో 11 పరుగులకు 3 వికెట్లు, బుమ్రా 12 పరుగులకు 3 వికెట్లు పడగొట్టారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బ్యాటింగ్ లైనప్ పూర్తిగా కెఎల్ రాహుల్‌పై ఆధారపడింది. రాహుల్ 6 బంతుల్లో 11 పరుగులకు పెవిలియన్ చేరగా.. ఆ వెంటనే ఫాఫ్ డుప్లెసిస్, అభిషేక్ పోరెల్ చెరో ఆరు పరుగులకు అవుట్ అయ్యారు. సమీర్ రిజ్వీ(39) ఒక్కడే టాప్ స్కోరర్ కాగా.. విప్రజ్ నిగమ్ 20 పరుగులు చేశాడు.
IPL 2025లో ముంబై ఇండియన్స్ అద్భుతమైన పునరాగమనం చేసింది. ముంబై ఇండియన్స్ తమ మొదటి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో ఓడిపోయింది. చెన్నై, గుజరాత్ చేతిలో ఘోర ఓటమి తర్వాత KKRపై గెలిచింది. కానీ ఆ తర్వాత లక్నో, RCB చేతిలో పరాజయాలు అందుకుంది. ఆపై ముంబై తన కంబ్యాక్ గట్టిగా ఇచ్చింది. తర్వాతి 8 మ్యాచ్‌ల్లో ముంబై 7 గెలిచింది. ముంబై జట్టు ఢిల్లీని 12 పరుగుల తేడాతో ఓడించగా, హైదరాబాద్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది.ఆ తర్వాత వరుసగా చెన్నై, హైదరాబాద్, లక్నో, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్‌పై విజయాలు అందుకుంది. ఇక కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీని ఓడించి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది.
IPL 2025లో నాలుగో స్థానం ఖరారైంది. ముంబై ఇండియన్స్ 13 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో నాల్గవ స్థానాన్ని దక్కించుకుంది. ఈ జట్టుకు ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది. ముంబై తన తదుపరి మ్యాచ్‌ను మే 26న పంజాబ్‌తో ఆడాల్సి ఉంది, ఈ మ్యాచ్ జైపూర్‌లో జరగనుండగా.. ఇందులోనూ గెలిచి టాప్ 2లో స్థానం దక్కించుకోవాలని ఉవ్విళ్ళూరుతోంది ముంబై ఇండియన్స్.
That’s a quality performance with a capital 𝐐 😉
Time to build momentum for the playoffs and #StayAhead 🚀
Vote for your Castrol Performance of the Day ➡ https://t.co/tb9qhZYp06#MumbaiIndians #PlayLikeMumbai #CastrolEdge | @Castrol_India | @bp_plc pic.twitter.com/uQITZMIFu7
— Mumbai Indians (@mipaltan) May 21, 2025