IPL 2025: మరోసారి రోహిత్ శర్మను ఘోరంగా అవమానించిన హార్ధిక్ పాండ్యా! ఎందుకంత యాటిట్యూడ్ అంటూ..
ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌లో తిలక్ వర్మ రిటైర్డ్ అవుట్ అవ్వడం, హార్ధిక్ పాండ్యా రోహిత్ శర్మ సలహాలను పట్టించుకోకపోవడం తీవ్ర వివాదానికి దారితీశాయి. రోహిత్ గాయంతో ఉన్నా కూడా జట్టుకు సహాయం చేయడానికి ప్రయత్నించాడు. కానీ, పాండ్యా ప్రవర్తనపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ముంబై టీమ్‌లో బాండింగ్ లేకపోవడం, కెప్టెన్సీ వివాదం ఇంకా కొనసాగుతున్నాయని అభిమానులు అంటున్నారు.

ఐపీఎల్ 2025లో భాగంగా శుక్రవారం ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఎంత ఉత్కంఠగా సాగిందో.. ఆ తర్వాత అంత వివాదాస్పదం కూడా అవుతోంది. ముంబై విజయానికి 7 బంతుల్లో 24 పరుగులు అవసరమైన టైమ్‌లో తిలక్ వర్మను రిటైర్డ్ అవుట్‌గా బయటికి పంపించడం ఒకటైతే.. ముంబై కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను అవమానించాడంటూ మరో వివాదం చెలరేగింది. నిన్నటి మ్యాచ్‌లో రోహిత్ శర్మ గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమైన విషయం తెలిసిందే. అయినా కూడా టీమ్ కోసం తన వంతు ప్రయత్నం చేశాడు రోహిత్. ముంబై ఇండియన్స్ బౌలింగ్ చేస్తున్న క్రమంలో.. పవర్ ప్లే ముగిసిన తర్వాత స్ట్రాటజిక్ టైమ్ అవుట్ వచ్చింది.
ఆ టైమ్‌లో గ్రౌండ్‌లోకి వచ్చిన రోహిత్ శర్మ హార్ధిక్ పాండ్యాకు ఏదో చెప్పబోయాడు.. స్లోవర్ బాల్ వేయాల్సిందిగా చెబుతున్నట్లు తెలుస్తోంది. కానీ, రోహిత్ చెబుతున్న విషయాన్ని పట్టించుకోకుండా పాండ్యా అతన్ని అవౌడ్ చేశాడు. అక్కడే ఉన్న సూర్యకుమార్ యాదవ్ మాత్రం రోహిత్ చెబుతున్న విషయాన్ని పూర్తిగా విన్నాడు. ఆశ్చర్యకరంగా తర్వాత హార్ధిక్ పాండ్యా స్లోవర్ బాల్స్‌తోనే వికెట్ తీశాడు. ఒక సీనియర్ ప్లేయర్, ఫ్రాంచైజీకి మాజీ కెప్టెన్, టీమిండియా కెప్టెన్, ముంబైకి ఐదు ట్రోఫీలు అదించిన కెప్టెన్ ఇన్ని ఘనతలు ఉన్న ఓ ఆటగాడు.. జట్టు మేలుకొరి, గాయంతో ఉండి కూడా గ్రౌండ్‌లోకి వచ్చి మరీ ఒక విషయం చెబుతుంటే.. ఒక కెప్టెన్‌గా అతను ఏం చెబుతున్నాడో వినకుండా పాండ్యా వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
పాండ్యా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడంటూ ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీన్స్ చూసిన తర్వాత ముంబై ఇండియన్స్‌లో ఆటగాళ్ల మధ్య సరైన బాండింగ్ లేదని, కెప్టెన్సీ విషయంలో తలెత్తిన వివాదం ఇంకా సమసిపోలేదంటూ క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు. 2024 సీజన్ కంటే ముందు రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి.. ముంబై మేనేజ్‌మెంట్ హార్ధిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో రోహిత్ బాగా హర్ట్ అయ్యాడు. అప్పటి నుంచి ముంబై టీమ్‌లో సరైన వాతావరణం అయితే కనిపించడం లేదనేది వాస్తవం. మరి ఇది ఎప్పటికి మారుతుందో చూడాలి.
Rohit sharma ignored by hardik pandya#RohitSharma #IPL2025 pic.twitter.com/YtriOMiOhL
— Zsports (@_Zsports) April 5, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.