Retired out: తిలక్‌ను టీమ్ నుంచి బయటికి పంపే కుట్ర..? అసలు ముంబై ఇండియన్స్‌లో ఏం జరుగుతోంది?
ముంబై ఇండియన్స్ తమ యువ బ్యాట్స్‌మన్ తిలక్ వర్మను ఒక కీలకమైన సమయంలో రిటైర్డ్ అవుట్ చేయడంపై వివాదం చెలరేగింది. అతని స్థానంలో స్పిన్నర్‌ను దింపడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. తిలక్ వర్మ రోహిత్ శర్మకు చాలా సన్నిహితంగా ఉండటంతో, హార్దిక్ పాండ్యా ప్రభావం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది తిలక్ వర్మ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని విమర్శలు వస్తున్నాయి.

ముంబై ఇండియన్స్‌లో మరో కొత్త వివాదం రాజుకుంది. యంగ్ టాలెంటెడ్ బ్యాటర్, మా టీమ్‌తోనే ఉండాలని రిటేన్ చేసుకున్న ప్లేయర్‌ను.. విజయానికి 7 బంతుల్లో 24 పరుగులు అవసరమైన టైమ్‌లో ఇతను పనికి రాడంటూ.. రిటైర్ అవుట్‌గా బయటికి పంపించారు. అతని ప్లేస్‌లో స్పిన్ ఆల్‌రౌండర్ మిచెల్ సాంట్నర్‌ను బ్యాటింగ్‌కు దింపారు. ఒక క్వాలిటీ బ్యాటర్‌ను కాకుండా.. స్పిన్ ఆల్‌రౌండర్‌ను బ్యాటింగ్‌కు పిలవడంతో ముంబై ఫ్యాన్స్ షాక్ అయ్యారు. తిలక్ వర్మ స్లోగా ఆడుతున్నాడని, షాట్లు సరిగ్గా కనెక్ట్ చేయలేకపోతున్నాడనే కారణాలు చెబుతున్నా.. ఒక యంగ్ బ్యాటర్ క్యాపబులిటీని క్వశ్చన్ చేస్తూ.. ఈ రకంగా అవమానించడం ఎంత వరకు కరెక్ట్ అనే ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.
ఒకసారి ఆలోచించండి.. ఇదే పరిస్థితుల్లో ఒక టెయిలెండర్‌ను పంపితే సరే అనుకోవచ్చు, గతంలో అశ్విన్ తనకు తానుగా ఇలా వెళ్లిపోయాడు. కానీ, ఇక్కడ తిలక్‌ను బలవంతంగా బయటికి పంపారు. నువ్వు సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోతున్నావ్.. అని ఓ యంగ్ ప్లేయర్‌ను ఇలాంటి ఒక బిగ్ స్టేజ్‌పై వెనక్కి పంపితే అతని మానసిక స్థితి ఎలా ఉంటుందో ఎవరైన ఊహించగలరా? అతను గాయపడలేదు, అలసిపోలేదు, టెయిలెండర్ కాదు.. 23 బంతుల్లో 25 పరుగులు మాత్రమే చేశాడు, షాట్లు కొట్టడం లేదనే కారణంతో రిటైర్డ్ అవుట్‌గా వెళ్లిపోమడం న్యాయం కాదు. పైగా ఇదో లీగ్ మ్యాచ్, నాకౌట్, ఫైనల్ అంత క్రూషియల్ మ్యాచ్ కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఒక యంగ్ ప్లేయర్ కాన్పిడెన్స్‌ను ముంబై ఇండియన్స్ దెబ్బతీసిందని చెప్పొచ్చు. ఇదంతా చూస్తే.. తిలక్ వర్మపై కుట్ర జరుగుతుందేమో అనే అనుమానాలు క్రికెట్ అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి.
తిలక్ వర్మ రోహిత్ శర్మకు చాలా క్లోజ్‌గా ఉంటాడు. అన్న అన్న అంటూ అతని కుటుంబానికి కూడా తిలక్ ఎంతో క్లోజ్. రోహిత్ కూతురంటే తిలక్‌కు, తిలక్ అంటే రోహిత్ చిన్నారి కూతురికి ఎంతో ఇష్టం. వాళ్లిద్దరి మధ్య బాబాయ్, కూతురి బాండింగ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ టీమ్‌పై హార్ధిక్ పాండ్యా పూర్తి స్థాయి గ్రిప్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రోహిత్‌కు గాయమంటూ, ఫామ్‌లో లేడంటూ అతన్ని పక్కన పెట్టాడు. రోహిత్‌కి సపోర్ట్‌గా ఉంటే సూర్య, బుమ్రాను పాండ్యా టార్గెట్ చేయలేదు. ఇక రోహిత్ గ్రూప్‌లో మిగిలింది తిలక్ ఒక్కడే.. సో.. ఈ విధంగా అతన్ని టార్గెట్ చేసి టీమ్ నుంచి అతనే బయటికి వెళ్లిపోయేలా ఏమైనా కుట్ర చేస్తున్నారా? అని సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి క్రికెట్ ఫ్యాన్స్ నుంచి వ్యక్తం అవుతున్న ఈ అనుమానాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.