DC vs LSG Playing XI, IPL 2025: టాస్ గెలిచిన అక్షర్.. బ్యాటింగ్ చేయాలంటూ ఫోర్స్ చేసిన పంత్
Delhi Capitals vs Lucknow Super Giants Confirmed Playing XI in Telugu: ఢిల్లీ క్యాపిటల్స్ (DC) వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి క్రికెట్ స్టేడియంలో జరుగులోన్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో లక్నో టీం బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఆడటం లేదు.

Delhi Capitals vs Lucknow Super Giants, 4th Match: ఐపీఎల్-18 నాల్గవ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ (DC) వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో లక్నో టీం బ్యాటింగ్ చేయనుంది. కాగా, పంత్, అక్షర్ మధ్య ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. టాస్ గెలిచిన అక్షర్‌ను బ్యాటింగ్ చేయాలంటూ పంత్ సరదాగా ఆటపట్టించాడు. దీంతో అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఆడటం లేదు. ఆయన తండ్రి కాబోతున్నందున విశ్రాంతి తీసుకున్నాడు.
ఈ మైదానంలో ఢిల్లీ, లక్నో జట్లు తొలిసారిగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ మాజీ కెప్టెన్ లక్నోకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మెగా వేలంలో పంత్‌ను లక్నో రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. తద్వారా అతను చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్(కీపర్), సమీర్ రిజ్వి, అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్.
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్(కీపర్, కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాఠీ, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్.
రెండు జట్ల ఇంపాక్ట్ ప్లేయర్లు:
లక్నో సూపర్ జెయింట్స్ ఇంపాక్ట్ సబ్స్: మణిమారన్ సిద్ధార్థ్, అబ్దుల్ సమద్, హిమ్మత్ సింగ్, ఆకాష్ సింగ్, ఆర్ఎస్ హంగర్గేకర్.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ సబ్స్: కరుణ్ నాయర్, అశుతోష్ శర్మ, డోనోవన్ ఫెరీరా, త్రిపురాన విజయ్, దర్శన్ నల్కండే.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..