GT vs PBKS IPL 2025 Match Prediction: మరో హై స్కోరింగ్ మ్యాచ్‌కు సిద్ధమైన గుజరాత్, పంజాబ్..
Gujarat Titans vs Punjab Kings, 5th Match Preview: గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన 5 మ్యాచ్‌లలో 4 మ్యాచ్‌లు చివరి ఓవర్ వరకు చేరుకున్నాయి. ఇది రెండు జట్ల మధ్య మ్యాచ్ ఎంత ఉత్కంఠభరితంగా ఉందో రుజువు చేస్తుంది. ఈ ఐదు మ్యాచ్‌ల్లో గుజరాత్ 3, పంజాబ్ 2 మ్యాచ్‌ల్లో గెలిచాయి.

Gujarat Titans vs Punjab Kings, 5th Match Preview: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఐదవ మ్యాచ్ మంగళవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అధిక స్కోరింగ్ పిచ్‌పై గుజరాత్ టైటాన్స్ (GT) వర్సెస్ పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య ఉత్కంఠభరితమైన ఘర్షణ జరగనుంది. రెండు జట్ల మధ్య గణాంకాల గురించి మాట్లాడుకుంటే, మ్యాచ్ ఎప్పుడూ ఉత్కంఠభరితంగానే ఉంటుంది. 2022 నుంచి 2024 వరకు గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌లలో, నాలుగు మ్యాచ్‌లు చివరి ఓవర్ వరకు సాగాయి. ఇది రెండు జట్ల మధ్య మ్యాచ్ ఎంత ఉత్కంఠభరితంగా ఉందో రుజువు చేస్తుంది. ఈ ఐదు మ్యాచ్‌ల్లో గుజరాత్ మూడు, పంజాబ్ రెండు మ్యాచ్‌ల్లో గెలిచాయి.
రెండు జట్ల బ్యాట్స్‌మెన్ గురించి మాట్లాడుకుంటే, గ్లెన్ మాక్స్‌వెల్ మిడిల్ ఓవర్లలో దూకుడుగా బ్యాటింగ్ చేయడంలో పేరుగాంచాడు. సిక్సర్లు కొట్టడంలో కూడా మాక్స్‌వెల్ ముందంజలో ఉన్నాడు. రెండు జట్లలోనూ గ్లెన్ మాక్స్‌వెల్ (161 సిక్సర్లు), జోస్ బట్లర్ (160 సిక్సర్లు), మార్కస్ స్టోయినిస్ (91 సిక్సర్లు) ఉన్నారు.
ఇది కాకుండా, పంజాబ్ జట్టులో శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ వంటి వర్ధమాన యువ ఆటగాళ్ళు ఉన్నారు. ప్రతి మూడవ లేదా నాల్గవ బంతికి కనీసం ఒక బౌండరీ కొట్టే వ్యక్తిగా వీళ్లిద్దరు పేరుగాంచారు. పంజాబ్‌కు చెందిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఇప్పటివరకు 10 మ్యాచ్‌ల్లో 154.72 స్ట్రైక్ రేట్‌తో 229 పరుగులు చేశాడు. ఈసారి గుజరాత్ జట్టుకు శుభ్‌మాన్ గిల్, జోస్ బట్లర్ రూపంలో కొత్త ఓపెనింగ్ జోడీ చేరింది. ఇద్దరూ పవర్‌ప్లే సమయంలో దూకుడుగా పరుగులు సాధించడంలో దిట్టలే. గిల్ 10 మ్యాచ్‌ల్లో 147.7 స్ట్రైక్ రేట్‌తో 383 పరుగులు చేశాడు.
ఇక స్పిన్నర్ల విషయానికొస్తే, IPL 2023 నుంచి అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో వరుణ్ చక్రవర్తి (41) అగ్రస్థానంలో ఉండగా, యుజ్వేంద్ర చాహల్ (39), రషీద్ ఖాన్ (37) తరువాతి స్థానాల్లో ఉన్నారు. ఈ ముగ్గురు బౌలర్లు తమ జట్లకు చాలా ముఖ్యమైనవారు. మ్యాచ్‌ను తామే మలుపు తిప్పగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.
గుజరాత్ టైటాన్స్ తరపున రషీద్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మాక్స్‌వెల్‌తో జరిగిన 15 టీ20 ఇన్నింగ్స్‌ల్లో రషీద్ కేవలం 117 స్ట్రైక్ రేట్‌తో పరుగులు ఇచ్చాడు. రషీద్ ఇప్పటివరకు మూడుసార్లు మాక్స్‌వెల్‌ను అవుట్ చేశాడు. రషీద్ తన రికార్డు ప్రకారం రాణిస్తే, మిడిల్ ఓవర్లలో మాక్స్వెల్ కు అతను సమస్యగా మారవచ్చు.
పంజాబ్ కింగ్స్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్, అతనిపై బట్లర్, గిల్ వరుసగా 150, 126 స్ట్రైక్ రేట్లు కలిగి ఉన్నారు. అర్ష్‌దీప్ ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లను టీ20 మ్యాచ్‌లలో ఒక్కసారి మాత్రమే అవుట్ చేయగలిగాడు. ఈ రికార్డును మెరుగుపరుచుకోవడానికి అర్ష్‌దీప్ కూడా రంగంలోకి దిగుతాడు.
GT vs PBKS పిచ్ రిపోర్ట్ (నరేంద్ర మోడీ స్టేడియం)..
ఇక్కడి ఉపరితలం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. పరుగులు సాధించడానికి పుష్కలంగా అవకాశాలు ఉంటాయి. ఈ మైదానంలో లక్ష్యాన్ని ఛేదించాలని రెండు జట్లు కోరుకుంటున్నాయి. దీని ప్రకారం, ఏ కెప్టెన్ అయినా టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ చేయాలని నిర్ణయించుకోవచ్చు.
రెండు జట్లు..
గుజరాత్ టైటాన్స్ – శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్, సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్, కగిసో రబాడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నిషాంత్ సింధు, మహిపాల్ లోమ్రోర్, కుమార్ కుషాగ్ర, అనుజ్ రావత్, మానవ్ సుతార్, వాషింగ్టన్ సుందర్, గెరాల్డ్ కోట్జీ, అర్షద్ ఖాన్, గుర్నూర్ బ్రార్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, సాయి కిషోర్, ఇషాంత్ శర్మ, జయంత్ యాదవ్, గ్లెన్ ఫిలిప్స్, కరీం జనత్, కుల్వంత్ ఖేజ్రోలియా.
పంజాబ్ కింగ్స్ – శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, విజయ్‌కుమార్ విశాక్, యష్ ఠాకూర్, మార్కో జాన్సన్, జోష్ ఇంగ్లిస్, లాకీ ఫెర్గూసన్, అజ్మతుల్లా ఉమర్జాయ్, హర్నూర్ సింగ్, కుల్దీప్ సేన్, ప్రియాంష్ ఆర్య, ఆరోన్ హార్డీ, ముషీర్ ఖాన్, సూర్యాంష్ షెడ్జ్, జేవియర్ బార్ట్‌లెట్, పైలా అవినాష్, ప్రవీణ్ దుబే, నేహాల్ వధేరా, విష్ణు వినోద్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..