KKR vs SRH IPL 2024 Match Prediction: ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఇద్దరు.. ఢీ కొడితే భూకంపమే..

Kolkata Knight Riders vs Sunrisers Hyderabad Preview: కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు ఒకదానితో ఒకటి తలపడినప్పుడు గణాంకాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. ఇప్పటి వరకు ఇరుజట్లు 25 గేమ్‌ల్లో తలపడ్డాయి. వీటిలో 16 మ్యాచ్‌ల్లో KKR గెలిచింది. చివరిసారి SRH ఈడెన్ గార్డెన్స్‌లో ఆడినప్పుడు, హ్యారీ బ్రూక్ తొలి IPL సెంచరీ, మార్క్‌రామ్ హాఫ్ సెంచరీతో హైదరాబాద్ టీం కేవలం 4 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది.

KKR vs SRH IPL 2024 Match Prediction: ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఇద్దరు.. ఢీ కొడితే భూకంపమే..
Kkr Vs Srh

Updated on: Mar 23, 2024 | 8:06 AM

Kolkata Knight Riders vs Sunrisers Hyderabad Preview: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 మూడవ గేమ్ హై-వోల్టేజ్ ఎన్‌కౌంటర్‌గా మారనుంది. ముందుగా ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లైన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మిచెల్ స్టార్క్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఫోకస్‌లో ఉంటారు. గత సీజన్లలో ఈ ఇద్దరు ఆటగాళ్లకు అంత మంచి రికార్డులు లేదు. కానీ శ్రేయాస్ అయ్యర్ తిరిగి రావడం, గౌతమ్ గంభీర్ మెంటార్‌గా ఉండడంతో కోల్‌కతాకు కొత్త ఊపిరి వచ్చినట్లు ఉంది. అలాగే, SRH ఇప్పుడు ఈ సీజన్‌లో డార్క్ హార్స్‌గా ఉండేలా కనిపిస్తోంది.

KKR తొలి మ్యాచ్‌లో అయ్యర్ తాను ఫిట్‌గా ఉన్నానని, ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని ధృవీకరించాడు. మునుపటి సీజన్‌లో KKR తరపున ఆడలేదు. సుదీర్ఘ విరామం తర్వాత స్టార్క్ తిరిగి రావడం చూడొచ్చు. అతను కొత్త బంతితో చెలరేగితే ప్రత్యర్థులకు కష్టమే. అలాగే, బిగ్ హిట్టర్లు రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్ బలమైన టాప్ ఆర్డర్‌ను ఫాలో చేసేందుకు సిద్ధమయ్యారు. కేకేఆర్ స్పిన్ ద్వయం సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి SRH బ్యాటర్‌లకు చుక్కలు చూపించేందుకు సిద్ధమయ్యారు.

పిచ్, వాతావరణం..

ఇవి కూడా చదవండి

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ పిచ్‌లో ఎప్పుడూ తీవ్రమైన పోటీ కనిపిస్తుంది. ఇక్కడ బ్యాట్స్‌మెన్‌లు కూడా ఆరంభంలో ధాటిగా ఆడుతుంటారు. అలాగే, స్పిన్ బౌలర్లకు కూడా చాలా సాయం అందుతుంది. ఈడెన్ గార్డెన్స్‌లో సగటు స్కోరు దాదాపు 160లుగా నిలిచింది. వాతావరణం గురించి మాట్లాడితే, ఉష్ణోగ్రత 25 ° C ఉంటుంది. మంచు తగ్గే అవకాశం ఉంది.

మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం..

మ్యాచ్ టాస్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:00 గంటలకు జరుగుతుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. దీన్ని స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఈమ్యాచ్‌ను జియో సినిమా యాప్, వెబ్‌సైట్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

చివరి నిమిషంలో కేకేఆర్‌లో చేరిన ఫిల్ సాల్ట్..

జాసన్ రాయ్ IPL 2024 నుంచి వైదొలగడంతో KKR ఇంగ్లాండ్ వికెట్ కీపర్-బ్యాటర్ ఫిల్ సాల్ట్‌ను తీసుకుంది. చివరి నిమిషంలో మార్పు చేసింది. రహ్మానుల్లా గుర్బాజ్ చివరిగా అత్యుత్తమ ఫాంలో లేనందున ఈ మార్పు KKRకి కలసివచ్చే అవకాశం ఉంది. సాల్ట్ ప్లేయింగ్ XIలోకి అడుగుపెట్టినా ఆశ్చర్యం లేదు.

బలంగా కనిపిస్తున్నా.. లోపాలు వీడని హైదరాబాద్..

ట్రావిస్ హెడ్‌తో పాటు ఓపెనింగ్ స్థానం కోసం మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మలు పోటీ పడుతున్నారు. ఆ తర్వాత ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్ ఉన్నారు. కమిన్స్ మాత్రమే విదేశీ బౌలర్‌గా ఉన్నాడు. అంటే హైదరాబాద్ టీం ఆల్-రౌండర్ మార్కో జాన్‌సెన్‌ను వదిలివేయవలసి ఉంటుంది. లేదా మాజీ కెప్టెన్ మార్కమ్‌ను పక్కన పెడితే.. జాన్‌సెన్‌ను చేర్చుకునే అవకాశం ఉంటుంది.

గణాంకాలు..

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు ఒకదానితో ఒకటి తలపడినప్పుడు గణాంకాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. ఇప్పటి వరకు ఇరుజట్లు 25 గేమ్‌ల్లో తలపడ్డాయి. వీటిలో 16 మ్యాచ్‌ల్లో KKR గెలిచింది. చివరిసారి SRH ఈడెన్ గార్డెన్స్‌లో ఆడినప్పుడు, హ్యారీ బ్రూక్ తొలి IPL సెంచరీ, మార్క్‌రామ్ హాఫ్ సెంచరీతో హైదరాబాద్ టీం కేవలం 4 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. అయితే, నితీష్ రాణా, శార్దూల్ ఠాకూర్ అర్ధ సెంచరీలు చేసినప్పటికీ 23 పరుగుల తేడాతో హైదరాబాద్ మ్యాచ్‌ని గెలుచుకోవడంలో సహాయపడింది.

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు: ఫిలిప్ సాల్ట్(కీపర్), వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, మనీష్ పాండే, శ్రీకర్ భరత్, ముజీబ్ ఉర్ రహమాన్, అనుకుల్ రాయ్, రహ్మానుల్లా గుర్బాజ్, చేతన్ సకారియా, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, వైభవ్ అరోరా, దుష్మంత చమీరా, అంగ్క్రిష్ రఘువంశీ, సాకిబ్ హుస్సేన్, సుయాష్ శర్మ.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్(కీపర్), వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, జయదేవ్ ఉనద్కత్, అన్మోల్‌ప్రీత్ సింగ్ , ఉపేంద్ర యాదవ్, మయాంక్ మార్కండే, ఝటవేద్ సుబ్రమణ్యన్, సన్వీర్ సింగ్, ఫజల్హాక్ ఫరూఖీ, మార్కో జాన్సెన్, షాబాజ్ అహ్మద్, ఆకాష్ మహరాజ్ సింగ్, నితీష్ రెడ్డి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..