- Telugu News Photo Gallery Cricket photos MS Dhoni Didn't Sit Next To Sachin Tendulkar check here Interesting Fact
Sachin – Dhoni: ‘ధోనికి ఆ విషయంలో సిగ్గెక్కువ’.. సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
IPL 2024 మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగింది. ధోనీ, కోహ్లి ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్‌లో తలపడ్డారు. అయితే, మ్యాచ్‌కు ముందు సచిన్ టెండూల్కర్ ఐపీఎల్ మ్యాచ్ నిర్వాహకులతో మాట్లాడి ఎంఎస్ ధోని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు.
Updated on: Mar 23, 2024 | 8:33 AM

ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ జియో సినిమాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఎంఎస్ ధోనితో తన ప్రారంభ రోజులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చాలా సిగ్గుపడేవాడు. భారత జట్టులోకి వచ్చిన తొలినాళ్లలో నాతో ఎక్కువగా మాట్లాడేవాడు కాదంటూ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

ధోనీ తన బోర్డింగ్ పాస్ ఇతర క్రికెటర్లకు ఇచ్చేవాడు. అందుకే నా పక్కన కూర్చోలేదంటూ సచిన్ తెలిపాడు.

కొన్నాళ్ల తర్వాత సచిన్ టెండూల్కర్‌కు ఈ విషయం తెలిసిందంట. చాలా మంది ఆటగాళ్లు కూడా సచిన్‌తో చెప్పారంట. 'అతను (ధోని) మీ పక్కన సీటు పొందుతాడు. కానీ, ఇతర ఆటగాళ్లకు బోర్డింగ్ పాస్‌లు ఇచ్చి, వేరేచోట కూర్చుంటాడు' అంటూ చెప్పారంట.

దిగ్గజ భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్సీ నుంచి వైదొలగాలని ఎంఎస్ ధోని తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించాడు.




