Delhi Capitals vs Sunrisers Hyderabad: హైదరాబాదీ బ్యాటర్లు మళ్లీ అదరగొట్టారు. ఢిల్లీ బౌలర్లను చితగొడుతూ మైదానంలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఓపెనర్లు హెడ్ (32 బంతుల్లో 89 11 ఫోర్లు,6 సిక్స్ లు), అభిషేక్ శర్మ( 12 బంతుల్లో 46, 2 ఫోర్లు, 6 సిక్సర్లు) పెను విధ్వంసం సృష్టించారు. ఆఖర్లో షాబాద్ అహ్మద్ ( 29 బంతుల్లో 59 నాటౌట్, 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. దీంతో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది. తెలుగబ్బాయి నితీశ్ రెడ్డి (37) కూడా ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడాడు. ఐడెన్ మార్‌క్రమ్ (1), హెన్రిచ్ క్లాసెన్ (15), సమద్ (13), పాట్ కమిన్స్ (1) నిరాశ పర్చడంతో చివరి ఓవర్లలో హైదరాబాద్ పెద్దగా పరుగులు చేయలేకపోయింది. ఢిల్లీ బౌలర్లలో కుల్‌దీప్ 4 వికెట్లు పడగొట్టగా.. ముకేశ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు.
Making striking look easy, the @SunRisers batters 🧡
ఇవి కూడా చదవండి250 up for #SRH for the 3rd time in the season 🔥
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #DCvSRH pic.twitter.com/3R0N6AWdNP
— IndianPremierLeague (@IPL) April 20, 2024
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ ఎలెవన్:
పాట్ కమిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఐదాన్ మర్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి నటరాజన్.
ఉమ్రాన్ మాలిక్, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఆకాష్ మహరాజ్ సింగ్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్
ఢిల్లీ ప్లేయింగ్ XI:
రిషబ్ పంత్ (కెప్టెన్ & వికెట్ కీపర్), డేవిడ్ వార్నర్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, ఎన్రిక్ నార్ట్జే, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్.
పృథ్వీ షా, షాయ్ హోప్, ప్రవీణ్ దూబే, రసిఖ్ దార్ సలామ్, సుమిత్ కుమార్
What a turnaround this from @DelhiCapitals 👏👏
Kuldeep Yadav gets the dangerous Travis Head while Axar Patel gets Heinrich Klaasen 👌👌
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱 #TATAIPL | #DCvSRH pic.twitter.com/mmJIBB2uEq
— IndianPremierLeague (@IPL) April 20, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి