ఆదివారం (ఏప్రిల్ 07) జరిగిన ఐపీఎల్ 17వ ఎడిషన్ 20వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 29 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా లీగ్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది హార్దిక్ సేన. ఈ మ్యాచ్‌లో ముంబై తరఫున అద్భుత బ్యాటింగ్‌ను కనబర్చిన కెప్టెన్ రోహిత్ శర్మ 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతో 49 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తద్వారా టీ20 క్రికెట్‌లో ఒక అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ వరకు రోహిత్ శర్మ టీ20 క్రికెట్‌లో మొత్తం 9 బౌండరీలతో 1508 బౌండరీలు పూర్తి చేశాడు. దీంతో ఈ ఫార్మాట్‌లో 1500కు పైగా బౌండరీలు బాదిన తొలి భారత ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు. రోహిత్ తర్వాత, టీ20 క్రికెట్‌లో ఇప్పటివరకు మొత్తం 1486 బౌండరీలు కొట్టిన భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు.
ప్రపంచ క్రికెట్‌లో టీ20 ఫార్మాట్‌లో అత్యధిక ఫోర్లు బాదిన రికార్డును పరిశీలిస్తే.. ఇప్పటివరకు మొత్తం 2196 ఫోర్లతో క్రిస్ గేల్ మొదటి స్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ అలెక్స్ హేల్స్ టీ20 ఫార్మాట్‌లో ఇప్పటివరకు 1855 బౌండరీలు కొట్టాడు. ఇప్పటి వరకు 1673 బౌండరీలు బాదిన ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ ( 27 బంతుల్లో49, 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్క పరుగు తేడాతో త్రుటిలో అర్ధసెంచరీ చేజార్చుకున్నాడు.
It stays hit when the 𝙃𝙄𝙏𝙈𝘼𝙉 hits it 🚀#MIvDC #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/kCecede2u7
— JioCinema (@JioCinema) April 7, 2024
ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఎలెవన్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, రొమారియో షెపర్డ్, పీయూష్ చావ్లా, జెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా.
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ XI: రిషబ్ పంత్ (కెప్టెన్ & వికెట్ కీపర్), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, జే రిచర్డ్‌సన్, ఎన్రిక్ నార్ట్జే, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..