
ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ఛాలెంజ్ ముగిసింది. ఈ లీగ్‌లో వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లింది ఆర్సీబీ. దీంతో ఆ జట్టుపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. అయితే ఐపీఎల్ 17వ సీజన్‌లో కూడా కోహ్లీ టీమ్ కు నిరాశే ఎదురైంది. ఎలిమినేటర్ రౌండ్‌లో రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఓటమి అభిమానులతో పాటు ఆటగాళ్లను కూడా బాధించింది. ఓటమి అనంతరం డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన ప్రతి RCB అభిమాని కంటతడి పెట్టుకుంటారు. RCB ఫ్రాంచైజీ ఈ వీడియోని X ఖాతాలో షేర్ చేసింది. మ్యాచ్ ఓడిన తర్వాత ఆటగాళ్ల మానసిక స్థితి ఈ వీడియోలో కనిపిస్తోంది. రాజస్థాన్ చేతిలో ఓటమి తర్వాత జట్టు మొత్తం నిరుత్సాహంగా మైదానాన్ని వీడింది. అయితే డ్రెస్సింగ్ రూమ్‌కి చేరుకోగానే వాతావరణం ఒక్కసారిగా విషాదంగా మారింది. మూడున్నర నిమిషాలఈ వీడియోలో అన్నీ రివీల్ అయ్యాయి.
రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాక్స్‌వెల్ ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌లోకి రాగానే గట్టిగా డోర్ ను కొట్టేశాడు. ఇక కింగ్ కోహ్లీ నిరాశతో తన మొబైల్ ఫోన్ వైపు చూస్తూనే ఉన్నాడు. కనీసం తల కూడా పైకి ఎత్తలేకపోయాడు. ఆటగాళ్ళు ఒకరికొకరు దూరంగా నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఎవరూ ఎవరితోనూ మాట్లాడలేదు. మేనేజ్ మెంట్ సిబ్బంది కూడా నిరాశగా కనిపించారు. ఫాఫ్ డుప్లెసిస్ కూడా ఆవేదనతో జట్టులో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత తమ జట్టను ప్రోత్సహించిన అభిమానులందరికీ కోహ్లీ ధన్యవాదాలు తెలిపాడు. దినేష్ కార్తీక్ కూడా తన మనసులోని భావాలను బయటపెట్టాడు.
Unfortunately, sport is not a fairytale and our remarkable run in #IPL2024 came to an end. Virat Kohli, Faf du Plessis and Dinesh Karthik express their emotions and thank fans for their unwavering support. ❤️#PlayBold #ನಮ್ಮRCB pic.twitter.com/FYygVD3UiC
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 23, 2024
ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచిన రాజస్థాన్ ఆర్సీబీని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. అయితే బెంగళూరు టీమ్ ధాటిగా ఆడలేకపోయింది. కీలక సమయాల్లో ఆటగాళ్లు వికెట్లు కోల్పోయారు. అలాగే రెండో ఇన్నింగ్స్‌లో మంచు కురవడంతో బౌలర్లు విఫలమయ్యారు. బ్యాడ్ ఫీల్డింగ్ రాజస్థాన్‌పై ఒత్తిడి పెంచలేకపోయింది. అయినా ఆర్సీబీ 19వ ఓవర్ వరకు పోరాడింది.
A not so fitting goodbye! 🥺
The 23 players and the coaching staff got tougher for one last time in the dressing room, to thank each other for the brilliant effort and wish their teammates the best of times ahead! ❤️#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 pic.twitter.com/89thKGXqtF
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 23, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..