
Lucknow Super Giants vs Mumbai Indians: ముంబై ఇండియన్స్ బ్యాటర్లు మళ్లీ తడబడ్డారు. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో సమష్ఠిగా విఫలమయ్యారు. ఫలితంగా డూ ఆర్ డై మ్యాచ్ లో ముంబై నామ మాత్రపు స్కోరుకే పరిమితమైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు కు లక్నో బౌలర్లు చుక్కలు చూపించారు. వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో పాటు పరుగులు రాకుండా కట్టడి చేశారు. ఫలితంగా ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 144 పరుగులు మాత్రమే చేసింది. నేహాల్ (41 బంతుల్లో 46, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), టిమ్ డేవిడ్ ( 18 బంతుల్లో 35 నాటౌట్, 3 ఫోర్లు, ఒక సిక్సర్) మాత్రమే ఓ మోస్తరుగా రాణించారు. ఓపెనర్ ఇషాన్ కిషన్ (32) ఫర్వాలేదనిపించాడు. బర్త్ డే బాయ్ రోహిత్ శర్మ (4), తిలక్ వర్మ (7), సూర్య కుమార్ యాదవ్ (10), హార్దిక్ పాండ్యా (0), నబీ (1) పూర్తిగా నిరాశపరిచారు. లక్నో బౌలర్లలో మోసిన్ 2 వికెట్లు పడగొట్టగా.. స్టాయినిస్, నవీనుల్, మయాంక్, బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.
Mohsin Khan’s pitch perfect yorker! ⚡️⚡️
ఇవి కూడా చదవండిNehal Wadhera departs after a well-made 46
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #LSGvMI pic.twitter.com/xVlIYdMGvL
— IndianPremierLeague (@IPL) April 30, 2024
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):
ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నెహాల్ వధేరా, టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, గెరాల్డ్ కొట్జియా, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా.
నువాన్ తుషార, కుమార్ కార్తికేయ, డెవాల్డ్ బ్రీవిస్, నమన్ ధీర్, షామ్స్ ములానీ
లక్నో సూపర్‌జెయింట్స్ (ప్లేయింగ్ ఎలెవన్):
కేఎల్ రాహుల్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, ఆయుష్ బదోనీ, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్.
అర్షిన్ కులకర్ణి, మణిమారన్ సిద్ధార్థ్, కృష్ణప్ప గౌతం, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్
Nehal Wadhera says challenge accepted 😎
💯 up for Mumbai Indians 🙌
4️⃣ overs to go, can the visitors reach a competitive total? 🤔
Watch the match LIVE on @JioCinema and @starsportsindia 💻📱#TATAIPL | #LSGvMI pic.twitter.com/GCfqBdh0Js
— IndianPremierLeague (@IPL) April 30, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..