ఐపీఎల్ 2024 టోర్నీలో ముంబై ఇండియన్స్‌కు మరో ఓటమి ఎదురైంది. ఈ టోర్నీని ముంబై ఇండియన్స్ ఓటమితో ప్రారంభించింది. ఈ సీజన్ ఆరంభంలో వరుసగా మూడు పరాజయాలను చవిచూసింది. ఆ తర్వాత పునరాగమనం చేసి మూడు మ్యాచ్‌లు గెలిచింది. అయితే ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. కోల్‌కతా చేతిలో ఓటమితో ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ కథ దాదాపుగా ముగిసినట్టే. ప్రస్తుతం ఆ జట్టు 6 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్‌లు గెలిచినా కూడా పెద్దగా ఉపయోగపడదు. కాబట్టి ఈ మూడు మ్యాచ్‌లు లాంఛనప్రాయంగా మాత్రమే ఉంటాయి. ఎందుకంటే నెట్ రన్ రేట్ మెరుగుపరుచుకోవడం చాలా కష్టం. కాగా, కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో ముంబై విజయం సాధించేలా కనిపించింది. కానీ అనూహ్యంగా ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ఓటమి తర్వాత ఇర్ఫాన్ పఠాన్ ఒక ప్రశ్న లేవనెత్తాడు. ముంబై వరుస ఓటములకు మొత్తం కెప్టెన్ హార్దిక్ పాండ్యా నే కారణమని బాంబ్ పేల్చాడు.
హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా చేయాలనే నిర్ణయం తప్పని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు.
‘క్రికెట్‌లో కెప్టెన్ పాత్ర కీలకం. పాండ్యా నాయకత్వంలో చాలా సమస్యలు ఉన్నాయి. MI బృందం కాగితంపై చాలా బలంగా కనిపిస్తుంది. కానీ మైదానంలో ఆట మాత్రం దారుణంగా ఉంది. హార్దిక్ నిర్ణయాలు ఎవరికీ అర్థం కావడం లేదు. గత మ్యాచ్ లో ఒకానొక దశలో కోల్‌కతా 5 వికెట్లు కోల్పోయింది. అయితే ఆ సమయంలో పార్ట్‌టైమ్ బౌలర్ నమన్ ధీర్‌తో 3 ఓవర్లు వేయించాలనేది చాలా తప్పుడు నిర్ణయం. దీంతో KKR బ్యాటర్లు కోలుకున్నారు. భారీ భాగస్వామ్యాన్ నెలకొల్పారు. ఫలితంగా MI ముందుగానే వారిని ఆల్ అవుట్ చేసే అవకాశాన్ని కోల్పోయింది. నమన్ ధీర్‌కు బదులుగా హార్దిక్ జట్టులోని ప్రధాన బౌలర్లకు బంతిని అందజేసి ఉండాల్సింది. అని ఇర్ఫాన్ సూచించాడు.
Irfan Pathan exposes Hardik Pandya Captaincy 🗣️-
“Mumbai Indians solid team on paper not managed well by their captain again. This Complete team failure on this loss.” pic.twitter.com/oIdW97Chao
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) May 3, 2024
‘హార్దిక్ పాండ్యా మొదటి నుంచి తప్పులు చేస్తూనే ఉన్నాడు. అతని నాయకత్వంలో జట్టు సమష్టిగా ఆడకపోవడం పెద్ద సమస్య. కెప్టెన్‌ని ఆటగాళ్లందరూ అంగీకరించాలి. పాండ్యా విషయంలో మాత్రం అలా కనిపించడం లేదు. ఐపీఎల్ 2024లో జట్టు పరిస్థితి దారుణంగా ఉంది’ అని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన చేసింది. 11 మ్యాచ్‌ల్లో 8 ఓడిపోయి ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. హార్దిక్ పాండ్యా 11 మ్యాచ్‌ల్లో 197 పరుగులు చేశాడు.
At the commentary I raised this question at the time. Why would you bowl Raman dhir for three overs when kkr is 57/5 ?? Why?
— Irfan Pathan (@IrfanPathan) May 3, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..