MI Vs GT: రేయ్ పిల్లబచ్చా.! రోహిత్‌ను బంతిలా ఆడుకుంటావా.? ముంబైకి శనిలా దాపురించావు..

|

Mar 25, 2024 | 11:32 AM

తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచింది.. అన్నట్టు.. అనామకుడ్ని తీసుకొచ్చి జట్టులో చేర్చి.. అవకాశాలు ఇచ్చి.. పైపైకి తీసుకొస్తే.. ఆఖరికి గురువుకే.. పెద్ద గునపం దించాడు ఆ శిష్యుడు. ఇప్పటికే మీకు అర్ధమై ఉంటుంది ఎవరి గురించి చెబుతున్నానో.. అదేనండీ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా.. అందుకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

MI Vs GT: రేయ్ పిల్లబచ్చా.! రోహిత్‌ను బంతిలా ఆడుకుంటావా.? ముంబైకి శనిలా దాపురించావు..
Rohit Sharma Hardik Pandy
Follow us on

ఐపీఎల్ 2024 సీజన్ తొలి మ్యాచ్‌లో ముంబై ఓటమిపాలైంది. గుజరాత్ టైటాన్స్‌పై సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో.. 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఎంఐ కొత్త కెప్టెన్ హార్దిక్ పేలవ కెప్టెన్సీ, సరైన సమయంలో బ్యాటర్లు చేతులెత్తేయడంతో.. ముంబై జట్టు మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇదంతా పక్కనపెడితే.. ముంబై బౌలింగ్ చేస్తున్న సమయంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రవర్తించిన తీరు.. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఐదుసార్లు ముంబైకి ట్రోఫీ అందించాడన్నది కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఓ యువ ప్లేయర్‌ను చూసినట్టుగా వ్యవహరించిన తీరుపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ధోని, రుతురాజ్‌లను చూసి నేర్చుకో పాండ్యా అంటూ తిట్టిపోస్తున్నారు.

అనుకున్నట్టుగానే తొలి మ్యాచ్ నుంచే రోహిత్ శర్మను టార్గెట్ చేశాడు హార్దిక్ పాండ్యా. కెరీర్‌ స్టార్టింగ్ తప్పితే.. ఇప్పటివరకు ఎన్నడూ లాంగ్ ఆన్, లాంగ్ ఆఫ్, బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేయలేదు రోహిత్ శర్మ. ఎప్పుడూ 30 యార్డ్స్ సర్కిల్ లోపల, లేదా స్లిప్స్, లేదా మిడ్ ఆఫ్ లాంటి క్యాచింగ్ పొజిషన్లలోనే ఫీల్డింగ్ చేస్తూ వచ్చిన హిట్‌మ్యాన్.. ఎప్పటికప్పుడు బౌలర్లకు, కీపర్‌కు సలహాలు ఇస్తూ టీంను ముందుకు నడిపించేవాడు. అలాంటివాడ్ని హార్దిక్ ఘోరంగా అవమానించాడు. మాజీ కెప్టెన్ కాబట్టి.. అతడి నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాల్సింది పోయి.. 30 యార్డ్స్ సర్కిల్ ఫీల్డింగ్ చేస్తోన్న హిట్‌మ్యాన్‌ను.. పోయి బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేయమన్నాడు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన రోహిత్ ఫ్యాన్స్.. హార్దిక్‌పై తెగ మండిపడుతున్నారు. హిట్‌మ్యాన్ ఇక ఆ జట్టులో ఉండద్దు అని.. మరో జట్టుకు వెళ్లిపో అని కొందరు అంటే.. కర్మ ఈజ్ బూమార్యాంగ్.. టీమిండియాలో ఆడినప్పుడు.. రోహిత్ చేతుల్లో హార్దిక్‌కు ఉంటుంది భయ్యో.! అంటూ మరికొందరు కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు.