IPL 2024: ఓటమి బాధలో ఉన్న గిల్‌కు భారీ షాక్.. ఏకంగా 12 లక్షల జరిమానా.. అంత పెద్ద తప్పు ఏం చేశాడబ్బా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 17వ ఎడిషన్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ 63 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. ఈ ఓటమి తర్వాత గుజరాత్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు జరిమానా పడింది. తద్వారా ఐపీఎల్‌ 2024లో జరిమానాకు గురైన తొలి కెప్టెన్‌గా, ఆటగాడిగా శుభ్‌మన్ గిల్ నిలిచాడు

IPL 2024: ఓటమి బాధలో ఉన్న గిల్‌కు భారీ షాక్.. ఏకంగా 12 లక్షల జరిమానా.. అంత పెద్ద తప్పు ఏం చేశాడబ్బా?
Shubman Gill
Follow us

|

Updated on: Mar 27, 2024 | 5:17 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 17వ ఎడిషన్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ 63 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. ఈ ఓటమి తర్వాత గుజరాత్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు జరిమానా పడింది. తద్వారా ఐపీఎల్‌ 2024లో జరిమానాకు గురైన తొలి కెప్టెన్‌గా, ఆటగాడిగా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. మార్చి 26న చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్‌కు గానూ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు జరిమానా విధించారు. మినిమమ్ ఓవర్ రేట్ కింద IPL ప్రవర్తనా నియమావళి ప్రకారం అతనికి జరిమానా పడింది. ఈ లెక్క ప్రకారం శుభమాన్ గిల్ మొత్తం రూ.12 లక్షల జరిమానా చెల్లించాలి. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ప్రతి జట్టు 20 ఓవర్లను 1 గంట 30 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఎక్కువ సమయం తీసుకుంటే, ఒక ఫీల్డర్ బౌండరీ లైన్ నుంచి తొలగిస్తారు. అదే తప్పును 2వ సారి పునరావృతం చేస్తే కెప్టెన్ కు రూ.24 లక్షలు. జరిమానా విధిస్తారు. అలాగే ప్లేయింగ్ XIలోని 10 మంది ఆటగాళ్లపై 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తారు.

రెండో మ్యాచ్ లోనే స్లో ఓవర్ రేటు తప్పిదం..

మూడోసారి ఇదే తప్పు పునరావృతమైతే జట్టు కెప్టెన్‌కు 30 లక్షల జరిమానా, అలాగే ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారు. దీంతో పాటు ప్లేయింగ్ XIలోని 10 మంది ఆటగాళ్లపై 12 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధిస్తారు. ఇప్పుడు కెప్టెన్‌గా తన 2వ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా శుభ్‌మాన్ గిల్ జరిమానా ఎదుర్కొన్నాడు. కాబట్టి అతను తదుపరి మ్యాచ్‌లో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. అలా కాకుండా మరో రెండు సార్లు ఈ పొరపాటు పునరావృతమైతే గిల్‌పై ఒక్క మ్యాచ్ నిషేధం పడే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి

ఇదే పునరావృతమైతే ఒక మ్యాచ్ వేటు..

అజ్మతుల్లా పుట్టిన రోజు వేడుకలు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..