Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: కింగ్ కోహ్లీకి పనస పండును బహుమతిగా ఇవ్వనున్న వీరాభిమాని.. దీని స్పెషల్ ఏంటో తెలుసా?

IPL 2024 68వ మ్యాచ్‌లో భాగంగా శనివారం (మే 18) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి . బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా ఈ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీకి  స్పెషల్ గిఫ్ట్ ఇస్తానంటున్నాడు ఓ వీరాభిమాని

IPL 2024: కింగ్ కోహ్లీకి పనస పండును బహుమతిగా ఇవ్వనున్న వీరాభిమాని.. దీని స్పెషల్ ఏంటో తెలుసా?
Virat Kohli Fan
Follow us
Basha Shek

|

Updated on: May 18, 2024 | 4:42 PM

IPL 2024 68వ మ్యాచ్‌లో భాగంగా శనివారం (మే 18) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి . బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా ఈ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీకి  స్పెషల్ గిఫ్ట్ ఇస్తానంటున్నాడు ఓ వీరాభిమాని. ఇది అలాంటి ఇలాంటి బహుమతి కాదు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టుబు గెరె పనస పండు. అవును, RCB టీమ్‌, మరీ ముఖ్యంగా విరాట్ కోహ్లీ అంటే విపరీతమైన అభిమానం చూపే అంబరీష్, దొడ్డబల్లాపూర్ తాలూకాలోని టుబు గెరె నుండి జాక్‌ఫ్రూట్‌తో బెంగళూరు చేరుకున్నాడు. ఇవాళ సాయంత్రం జరిగే RCB-CSK మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీకి ఈ జాక్‌ఫ్రూట్ బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాడు అంబరీష్. ‘విరాట్ కోహ్లీకి దేశ విదేశాల్లో పేరుగాంచిన తూబగెరె జాక్‌ఫ్రూట్‌ను అందించాలనుకుంటున్నాను. అలాగే ఈ మ్యాచ్ లో ఆర్‌సీబీ విజయం సాధించాలని, ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించాలి. ఇందుకోసం ఆర్సీబీకి ముందస్తుగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను’ అని వృత్తిరీత్యా రైతు అయిన అంబరీష్ ఆకాంక్షించారు.

అందుకు తగ్గట్టుగానే ఘాటి సుబ్రహ్మణ్యంలో ప్రత్యేక పూజలు చేసిన అంబరీష్ టుబుగెరెలోని పనసపండుతో బెంగళూరు చేరుకున్నారు. మరి ఈ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జాక్ ఫ్రూట్ విరాట్ కోహ్లీ చేతికి వెళుతుందో లేదో వేచి చూడాలి. కాగా శుక్రవారం (మే 18) తన 91వ పుట్టినరోజు జరుపుకున్న మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడకు కూడా టుబుగెరె జాక్‌ఫ్రూట్‌ను బహుమతిగా ఇచ్చారు అంబరీష్. తద్వారా జేడీఎస్ సీనియర్ నేత ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

H. D. Deve Gowda

H. D. Deve Gowda

ప్లేఆఫ్ డిసైడ్:

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నేడు ఆర్‌సీబీ, సీఎస్‌కే కీలక ప్లేఆఫ్ మ్యాచ్ ఆడనున్నాయి. అంటే ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే గెలిస్తే ప్లేఆఫ్‌కు చేరుకుంటుంది. RCB జట్టు ఇంకా 11 బంతులు మిగిలి ఉండగానే లేదా 18 పరుగులతో గెలిస్తే, వారు ప్లే ఆఫ్‌లోకి ప్రవేశిస్తారు. కాబట్టి నేటి మ్యాచ్‌లో ఇరు జట్ల నుంచి మంచి ఉత్కంఠ పోరును ఆశించవచ్చు.

ఇవి కూడా చదవండి

రెండు జట్ల మధ్య రికార్డులివే..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు 32 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఆర్‌సీబీ 10 మ్యాచ్‌లు గెలుపొందగా, సీఎస్‌కే 21 మ్యాచ్‌లు గెలిచింది. కొన్ని కారణాల వల్ల మరో మ్యాచ్ రద్దయింది. అంటే ఇరు జట్ల మధ్య పోరులో సీఎస్‌కేదే పైచేయి. మరి కీలక మ్యాచ్‌లో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..