KKR vs DC, IPL 2024: విజృంభించిన వరుణ్ చక్రవర్తి.. ఆఖరులో కుల్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?

Kolkata Knight Riders vs Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో కోల్ కతా బౌలర్లు అదరగొట్టారు. సమష్ఠిగా రాణించి ఢిల్లీ క్యాపిటల్స్ ను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. కేకేఆర్ బౌలర్ల ధాటికి ఢిల్లీ బ్యాటర్లు ఒక్కరూ క్రీడా క్రీజులో నిలవలేకపోయారు. తొమ్మిదో స్థానంలో వచ్చిన కుల్ దీప్ యాదవ్

KKR vs DC, IPL 2024: విజృంభించిన వరుణ్ చక్రవర్తి.. ఆఖరులో కుల్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
Kolkata Knight Riders vs Delhi Capitals

Updated on: Apr 29, 2024 | 11:48 PM

Kolkata Knight Riders vs Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో కోల్ కతా బౌలర్లు అదరగొట్టారు. సమష్ఠిగా రాణించి ఢిల్లీ క్యాపిటల్స్ ను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. కేకేఆర్ బౌలర్ల ధాటికి ఢిల్లీ బ్యాటర్లు ఒక్కరూ క్రీడా క్రీజులో నిలవలేకపోయారు. తొమ్మిదో స్థానంలో వచ్చిన కుల్ దీప్ యాదవ్ (26 బంతుల్లో 35, 5 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్ గా నిలిచాడంటే ఢిల్లీ బ్యాటర్లు ఎలా విఫలమయ్యారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కెప్టెన్ రిషభ్‌ పంత్ (27), అభిషేక్ పొరెల్ (18), అక్షర్ పటేల్ (15), పృథ్వీ షా (13), జేక్ ఫ్రేజర్ గర్క్ (12), ట్రిస్టన్ స్టబ్స్ (4), ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన కుమార్ కుశాగ్ర (1), షై హోప్ (6) ఇలా అందరూ తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేసింది. కోల్‌కతా బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి (3/16) ఢిల్ బ్యాటర్లకు మూకుతాడు వేశాడు. వైభవ్ అరోరా (29/2), హర్షిత్ రాణా (28/2) కూడా ఆకట్టుకున్నారు. సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్ తలో వికెట్ పడగొట్టారు.

రాణించిన కోల్ కతా బౌలర్లు..

ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఇదే:

కోల్ కతా నైట్ రైడర్స్:

ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్ ), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి

  ఇంపాక్ట్ ప్లేయర్లు:

అంగ్క్రిష్ రఘువంశీ, సుయాష్ శర్మ, అనుకూల్ రాయ్, మనీష్ పాండే, రహ్మానుల్లా గుర్బాజ్

ఢిల్లీ క్యాపిటల్స్:

పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్(వికెట్ కీపర్ అండ్ కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రసిఖ్ దార్ సలామ్, లిజాద్ విలియమ్స్, ఖలీల్ అహ్మద్

ఇంపాక్ట్ ప్లేయర్లు:

ముఖేష్ కుమార్, ప్రవీణ్ దూబే, రికీ భుయ్, సుమిత్ కుమార్, కుమార్ కుషాగ్రా

 

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..