లక్నో సూపర్ జెయింట్‌తో హోం గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో పాయింట్ల పట్టికలో టాప్ 4 నుంచి ఆ జట్టు బయటకు వచ్చేసింది. ప్రస్తుతానికి ఆ జట్టు ప్లే ఆఫ్ రేసులో ఇంకా అడుగుపెట్టనట్టే. బుధవారం (ఏప్రిల్23) జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు ఒక్కో సెంచరీ సాధించారు. అయితే ఇక్కడ తేడా ఏంటంటే.. సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చేసిన సెంచరీ వృథా అయితే, లక్నో తరఫున ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ చేసిన సెంచరీ జట్టు విజయానికి పునాది వేసింది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కి ఇది రెండో సెంచరీ. అయితే ఈ రెండు సెంచరీలు రుతురాజ్‌కు ఫర్వాలేదు. అంటే రుతురాజ్ సెంచరీ చేసిన ఈ రెండు మ్యాచ్ ల్లో చెన్నైకి విజయం దక్కలేదు. లక్నో సూపర్‌జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ 60 బంతుల్లో 108 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 3 సిక్సర్లు కూడా ఉన్నాయి. కానీ రుతురాజ్ కేవలం 56 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసినా తన పేరు మీద ఒక అనవసరమైన చెత్త రికార్డును లిఖించుకున్నాడు.
అదేంటంటే.. రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ చేసిన ప్రతిసారీ సీఎస్‌కే పరాజయం పాలవుతోంది. ఐపీఎల్ లో రుతురాజ్ ఇప్పటివరకు రెండు సెంచరీలు సాధించగా, రెండుసార్లు చెన్నై ఓడిపోయింది. దీంతో ఓడిపోయిన మ్యాచ్‌ల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రుతురాజ్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. ఓడిన మ్యాచ్‌ల్లో కోహ్లీ ఇప్పటి వరకు మూడు సెంచరీలు సాధించాడు.
RUTURAJ GAIKWAD BECOMES THE FIRST CAPTAIN TO SCORE HUNDRED IN CSK HISTORY 🫡 pic.twitter.com/knQnYcmPpC
— Johns. (@CricCrazyJohns) April 23, 2024
అయితే LSGపై రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సెంచరీ చేసిన తొలి కెప్టెన్‌గా రుతురాజ్ నిలిచాడు. గతంలో సీఎస్‌కే కెప్టెన్‌గా ధోనీ 84 పరుగుల ఇన్నింగ్స్ అత్యుత్తమం. ఇప్పుడు ఆ రికార్డును రుతురాజ్ అధిగమించాడు.
635 runs (45.36 Avg & 136.27 Sr) in IPL 2021.
590 runs (42.14 Avg & 147.50 Sr) in IPL 2023.
349* runs (58.17 Avg & 142.45 Sr) in IPL 2024.The Dominance of Ruturaj Gaikwad in IPL is remarkable 🫡 pic.twitter.com/kGYxbWbkCU
— Johns. (@CricCrazyJohns) April 24, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..