Sunrisers Hyderabad vs Rajasthan Royals Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 2024 సీజన్ 50వ మ్యాచ్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ జట్లు ముఖాముఖి తలపడనున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో రాజస్థాన్ వరుస విజయాలతో దూసుకెళుతోంది. ఇప్పటికే ప్లే ఆఫ్ కూడా సంజూ శాంసన్ సేన కన్నేసింది. మరోవైపు హైదరాబాద్ గత రెండు మ్యాచుల్లో వరుసగా పరాజయం పాలైంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ను చిత్తు చేసి గెలుపు బాట పట్టాలని చూస్తోంది. కాగా హైదరాబాద్ తమ సొంత మైదానంలో ఈ మ్యాచ్ ఆడుతోంది. ఈ సీజన్‌లో ఈ వేదికపై రికార్డు స్కోరు సాధించింది. అయితే ఇప్పుడు రాజస్థాన్‌పై హైదరాబాద్ 300 మార్కును సాధిస్తుందా? దీనిపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా స్టార్ ఆల్ రౌండర్ మార్కొమ్ జేసన్ ఆడనున్నాడు.
🚨 Toss Update 🚨@SunRisers win the toss and will be batting first against @rajasthanroyals
Follow the Match ▶️ https://t.co/zRmPoMjvsd#TATAIPL | #SRHvRR pic.twitter.com/VUCv2r7X9x
— IndianPremierLeague (@IPL) May 2, 2024
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI):
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అన్మోల్‌ప్రీత్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, T నటరాజన్
ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మార్కండే, ఐడెన్ మర్క్రమ్, సన్వీర్ సింగ్, జయదేవ్ ఉనద్కత్
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):
యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ
జోస్ బట్లర్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, శుభమ్ దూబే, నవదీప్ సైనీ, తనుష్ కోటియన్
Jansen replacing Markram is the only change to the side as we bat first at Uppal 👊
Let’s #PlayWithFire 🔥#SRHvRR @Dream11 pic.twitter.com/cDgcSbe1uT
— SunRisers Hyderabad (@SunRisers) May 2, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..