MI vs DC, IPL 2024: ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన ఢిల్లీ.. సూర్య వచ్చేశాడు..

|

Apr 07, 2024 | 4:04 PM

Mumbai Indians vs Delhi Capitals Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా 20వ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ముంబై ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోగా, ఢిల్లీ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో ఓడిపోయింది

MI vs DC, IPL 2024: ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన ఢిల్లీ.. సూర్య వచ్చేశాడు..
Mi Vs Dc Today Ipl Match
Follow us on

Mumbai Indians vs Delhi Capitals Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా 20వ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ముంబై ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోగా, ఢిల్లీ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో ఓడిపోయింది. కాబట్టి ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం. ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ జట్టులో రెండు మార్పులు చేశారు. రసిఖ్ దార్ సలామ్ స్థానంలో లలిత్ యాదవ్, గాయపడిన మిచెల్ మార్ష్ స్థానంలో జే రిచర్డ్‌సన్‌లు వచ్చారు.

 

ఇవి కూడా చదవండి

సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్‌లోకి అడుగుపెట్టాడు. సూర్య ఎంట్రీ కారణంగా, నమన్ ధీర్ పెవిలియన్ కే పరిమితమయ్యాడు. అఫ్గానిస్థాన్‌కు చెందిన అనుభవజ్ఞులైన ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ నబీ, రొమెరో షెపర్డ్‌లకు అవకాశం లభించింది.  డెవాల్డ్ బ్రెవిస్, క్వెన్ మఫాకా రిజర్వ్ బెంచ్ కు స్థానం కోల్పోయారు.

ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మొత్తం 33 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఢిల్లీతో ముంబయి 33 మ్యాచ్‌లు ఆడగా 18 విజయాలు సాధించింది. ఢిల్లీ 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కాగా, గత ఐదు మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌దే ఆధిపత్యం. ఢిల్లీ 5 మ్యాచ్‌ల్లో 3 గెలిచింది. ముంబై వర్సెస్ ఢిల్లీ రెండు జట్లు వాంఖడే వేదికగా 8 సార్లు తలపడ్డాయి. ముంబయి 5 గెలిచింది, ఢిల్లీ 3 మ్యాచ్‌లు గెలిచింది.

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ ఎలెవన్ :

డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, అభిషేక్ పోరెల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్/కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, జే రిచర్డ్‌సన్, రిచ్ నోకియా, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్.

ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఎలెవన్ :

రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, రొమారియో షెపర్డ్, పీయూష్ చావ్లా, జెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..