GT vs PBKS, IPL 2024: టాస్ గెలిచిన పంజాబ్.. గుజరాత్ లోకి కేన్ మామ వచ్చేశాడోచ్
Gujarat Titans vs Punjab Kings Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 2024 17వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.
Gujarat Titans vs Punjab Kings Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 2024 17వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఒకవైపు సొంత గడ్డపై గుజరాత్ టైటాన్స్ విజయాలతో దూసుకెళ్తుండగా, మరోవైపు గత 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయిన పంజాబ్ గెలుపు బాట పట్టాలని చూస్తోంది. అయితే గుజరాత్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ ఆటతీరు ఆ జట్టు మేనేజ్ మెంట్ ను కలవరపరుస్తోంది. నేటి మ్యాచ్ లోనైనా గిల్ భారీ ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు.కాగా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. కాబట్టి గుజరాత్ ముందుగా బ్యాటింగ్ కు దిగనుంది.
కాగా ఈ మ్యాచ్ లో ఇరు జట్లూ ఒక్కో మార్పు చేశాయి. పంజాబ్ కింగ్స్‌లో లియామ్ లివింగ్‌స్టన్ స్థానంలో సికందర్ రజా, గుజరాత్‌కు చెందిన డేవిడ్ మిల్లర్ స్థానంలో కేన్ విలియమ్సన్‌లు వచ్చారు.
“𝙏𝙖𝙞𝙡𝙨 𝙞𝙨 𝙩𝙝𝙚 𝙘𝙖𝙡𝙡 𝙖𝙣𝙙 𝙩𝙖𝙞𝙡𝙨 𝙞𝙩 𝙞𝙨”
Shikhar Dhawan has chosen to field first ✅#GTvPBKS #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/4Qsaqpi84x
— JioCinema (@JioCinema) April 4, 2024
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ -XI)
This is how we line up for today’s #GTvPBKS clash! 💪
➡️ Kane Williamson ⬅️ David Miller#AavaDe | #GTKarshe | #TATAIPL2024#PaidPartnership pic.twitter.com/kuJeLFRklM
— Gujarat Titans (@gujarat_titans) April 4, 2024
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, దర్శన్ నల్కండే.
ఇంపాక్ట్ ప్లేయర్:
BR శరత్, మోహిత్ శర్మ, సందీప్ వారియర్, అభినవ్ మనోహర్, మానవ్ సుతార్
Kane-struck! 💙#AavaDe | #GTKarshe | #TATAIPL2024 | #GTvPBKS pic.twitter.com/NyPL0y2lV8
— Gujarat Titans (@gujarat_titans) April 4, 2024
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ -XI)
శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, సికందర్ రజా, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, కగిసో రబాడ.
ఇంపాక్ట్ ప్లేయర్:
తాన్య త్యాగరాజన్, నాథన్ ఎల్లిస్, అశుతోష్ శర్మ, రాహుల్ చాహర్, విద్వత్ కవీరప్ప
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..