Chennai Super Kings Vs Lucknow Super Giants Confirmed Playing XI in Telugu: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ లో భాగంగా 39వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్ జట్లు తలపడనున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ ఇరు జట్లకు అత్యంత కీలకం. ఎందుకంటే ఈ మ్యాచ్‌తో ఇరు జట్లు ద్వితీయార్థాన్ని ప్రారంభిస్తున్నాయి. తద్వారా రెండో రౌండ్‌లో తొలి మ్యాచ్‌లో శుభారంభం చేయాలని ఇరు జట్లు లక్ష్యంగా పెట్టుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఇప్పటి వరకు నాలుగు సార్లు తలపడ్డాయి. సీఎస్‌కే ఒక మ్యాచ్‌లో విజయం సాధించగా, ఎల్‌ఎస్‌జీ 2 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కొన్ని కారణాల వల్ల మరో మ్యాచ్ రద్దయింది. అలాగే ఈసారి ఐపీఎల్ తొలి అర్ధభాగంలో చెన్నై సూపర్ కింగ్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం చెన్నై వేదికగా మ్యాచ్ జరుగుతున్నందున ఇరు జట్ల నుంచి హోరా హోరీ పోరు ఆశించవచ్చు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ కే ఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కాబట్టి చెన్నై మొదట బ్యాటింగ్ కు దిగనుంది.
These guys change the match from behind the stumps 😉
Watch your favorites 👉 𝙈𝙎 𝘿𝙝𝙤𝙣𝙞 and 𝙆𝙇 𝙍𝙖𝙝𝙪𝙡 on the HeroCam 📸 only with #IPLonJioCinema 📲#TATAIPL #CSKvLSG pic.twitter.com/50TOf1K1MF
— JioCinema (@JioCinema) April 23, 2024
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI):
అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రహ్మాన్, మతీషా పతిరానా.
సమీర్ రిజ్వీ, శార్దూల్ ఠాకూర్, షేక్ రషీద్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI):
క్వింటన్ డి కాక్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్/కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, మాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్.
దేవదత్ పడిక్కల్, అర్షిన్ కులకర్ణి, కృష్ణప్ప గౌతం, యుధ్వీర్ సింగ్ చరక్, మణిమారన్ సిద్ధార్థ్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..