CSK vs KKR, IPL 2024: కోల్‌కతాతో మ్యాచ్.. టాస్ గెలిచిన చెన్నై.. డేంజరస్ బౌలర్ మళ్లీ వచ్చాడు
Chennai Super Kings vs Kolkata Knight Riders Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 22వ మ్యాచ్‌లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది.

Chennai Super Kings vs Kolkata Knight Riders Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 22వ మ్యాచ్‌లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది. వరుసగా రెండు పరాజయాల తర్వాత మళ్లీ గెలుపు బాట పట్టాలని CSK ప్రయత్నిస్తుండగా, ఈ సీజన్ లో ఇప్పటివరకు ఓటమి ఎరుగని KKR తమ జోరును కొనసాగించాలని చూస్తోంది. చెన్నైలో టాస్ గెలిచిన సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి కోల్‌కతా ముందుగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది . కాగా కోల్‌కతాతో జరిగే మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్‌లో 3 మార్పులు చేసింది. ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు అవకాశం కల్పించారు. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ వీసా పూర్తి చేసుకుని తిరిగి జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా దీపక్ చాహర్‌కు అవకాశం రాలేదు. కాబట్టి మతిశ పతిరన అందుబాటులో లేడు. మరోవైపు, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఎటువంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగాడు.
ఇరు జట్లు ఇవే..
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ XI – రితురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రెహమాన్, తుషార్ దేశ్‌పాండే మరియు మహేశ్ తీక్షణ ఇంపాక్ల్ ప్లేయర్లు: శివమ్ దూబే, మొయిన్ అలీ, షేక్ రషీద్, మిచెల్ సాంట్నర్, నిశాంత్ సంధు
𝗡𝗘𝗪𝗦 𝗙𝗥𝗢𝗠 𝗖𝗛𝗘𝗣𝗔𝗨𝗞 📋
The toss goes Rutu’s way and Chennai Super Kings will be bowling first 🪙#CSKvKKR #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/y6gFoiZCgH
— JioCinema (@JioCinema) April 8, 2024
కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ XI
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.
ఇంపాక్ల్ ప్లేయర్లు: సుయాష్ శర్మ, అనుకుల్ రాయ్, మనీష్ పాండే, రహ్మానుల్లా గుర్బాజ్, సాకిబ్ హుస్సేన్
Thala ka 𝐇𝐮𝐤𝐮𝐦💛#IPLonJioCinema #TATAIPL #CSKvKKR pic.twitter.com/412ZAyecRR
— JioCinema (@JioCinema) April 8, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








