LSG vs CSK, IPL 2024: చెన్నైతో మ్యాచ్.. టాస్ గెలిచిన లక్నో.. స్టార్ ప్లేయర్ల ఎంట్రీ

|

Apr 19, 2024 | 7:19 PM

Lucknow Super Giants vs Chennai Super Kings Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 2024 లో భాగంగా 34వ మ్యాచ్‌లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్‌జెయింట్‌తో తలపడనుంది. గత రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన లక్నో సొంత గడ్డపై మళ్లీ గెలుపుబాట పట్టాలని చూస్తోంది

LSG vs CSK, IPL 2024: చెన్నైతో మ్యాచ్.. టాస్ గెలిచిన లక్నో.. స్టార్ ప్లేయర్ల ఎంట్రీ
LSG vs CSK Today IPL Match
Follow us on

Lucknow Super Giants vs Chennai Super Kings Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 2024 లో భాగంగా 34వ మ్యాచ్‌లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్‌జెయింట్‌తో తలపడనుంది. గత రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన లక్నో సొంత గడ్డపై మళ్లీ గెలుపుబాట పట్టాలని చూస్తోంది. అదే సమయంలో చెన్నై జట్టు తమ విజయాల పరంపరను కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది.ఇరు జట్ల గణాంకాలను పరిశీలిస్తే ఇప్పటి వరకు చెన్నై, లక్నో జట్ల మధ్య మొత్తం మూడు మ్యాచ్‌లు జరిగాయి. ఒక మ్యాచ్‌లో చెన్నై, ఒక మ్యాచ్‌లో లక్నో విజయం సాధించాయి. ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది.

ఈ  మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కే ఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కాబట్టి చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ కు దిగనుంది. ఇరు జట్లలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.

ఇవి కూడా చదవండి

 

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్:

రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివన్ దూబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని (వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరానా.

ఇంపాక్ట్ ప్లేయర్:

సమీర్ రిజ్వీ, శార్దూల్ ఠాకూర్, షేక్ రషీద్, నిశాంత్ సింధు, మిచెల్ సాంట్నర్.

లక్నో సూపర్‌జెయింట్స్ ప్లేయింగ్ ఎలెవన్:

క్వింటన్ డి కాక్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్, కెప్టెన్), దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, మాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్.

ఇంపాక్ట్ ప్లేయర్:

అర్షిన్ కులకర్ణి, కృష్ణప్ప గౌతమ్, యద్వీర్ సింగ్, మణి రామన్ సిద్ధార్థ్, అర్షద్ ఖాన్.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి