మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి అదరగొట్టింది. సోమవారం ముగిసిన ఐపీఎల్ ఫైనల్‌లో ఛాంపియన్‌గా ఆవిర్భవించింది. తద్వారా ఐదుసార్లు టైటిల్స్ అందుకున్నముంబై ఇండియన్స్ రికార్డును సమం చేసింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్‌లో చెన్నై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం గుజరాత్ విధించిన 171 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆఖరి బంతికి బౌండరీ కొట్టి చెన్నైను విజయ తీరాలకు చేర్చాడు. కాగా జడేజా ఫోర్ కొట్టగానే స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. ఇదే సమయంలో మ్యాచ్ చూడడానికి వచ్చిన జడ్డూ సతీమణి రివాబా జడేజా భావోద్వేగానికి లోనైంది. పట్టరాని ఆనందంతో కన్నీరు పెట్టుకుంటూ మైదానంలోకి వచ్చింది.
అదే సమయంలో జడేజా కూడా భార్యను చూసి ఆమె దగ్గరికి వచ్చాడు. సంతోషంతో సతీమణిని హత్తుకుని ఎమోషనల్ అయ్యాడు. రివాబా కూడా చిరునవ్వులు చిందిస్తూ జడేజాను మనసారా హత్తుకుంది. ఈ ఎమోషనల్ మూమెంట్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా మ్యాచ్ ప్రజేంటేషన్ అనంతరం ఐపీఎల్ ట్రోఫీతో కలిపి కెమెరాలకు పోజులిచ్చారు జడేజా ఫ్యామిలీ. సతీమణి రివాబాతో పాటు వారి కూతురును కూడా మనం ఈ ఫొటోలు, వీడియోల్లో చూడవచ్చు. కాగా 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్ నగర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు రివాబా జడేజా. బీజేపీ తరఫున ఆమె బరిలోకి దిగారు.
CSK ? ko champion ? banane wale Sir ravindra jadeja with his wife #IPL2023Finals #RavindraJadeja pic.twitter.com/MPVgaAPh5c
— Keshav Nagar (@keshavnagarncc) May 29, 2023
Ravindra Jadeja, his wife and his daughter with the IPL trophy.
A beautiful family picture! pic.twitter.com/esApFZeE7N
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 30, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..