IPL 2023: ‘హైదరాబాదీ ప్లేయర్’కి అరుదైన గౌరవం.. తిలక్ వర్మతో చేతులు కలిపిన రిలయన్స్.. కారణం ఏమిటంటే..?

|

Apr 14, 2023 | 11:47 AM

ముంబై బ్యాటర్లలో ఎవరు రాణించినా లేదా చేతులెత్తేసినా ఒక్క ఆటగాడు మాత్రం ‘తగ్గేదేలే’ అంటున్నాడు. అతనెవరో కాదు.. మన హైదరాబాదీ కుర్రాడైన ‘తిలక్ వర్మ. అవును, బెంగళూరుతో జరిగిన మ్యాచులో 46 బంతుల్లో 84 రన్స్ చేసిన తిలక్.. చెన్నైపై 22 పరుగులు.. ఆ తర్వాత ఢిల్లీ క్యాపటల్స్‌పై..

IPL 2023: ‘హైదరాబాదీ ప్లేయర్’కి అరుదైన గౌరవం.. తిలక్ వర్మతో చేతులు కలిపిన రిలయన్స్.. కారణం ఏమిటంటే..?
Tilak Varma
Follow us on

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ 3 మ్యాచ్‌లు ఆడగా.. ఒక్క ఆటలో మాత్రమే గెలిచింది. అందుకు ఆ టీమ్‌లో ఉన్న ఆటగాళ్లు సమిష్టిగా రాణించకపోవడమే ప్రధాన కారణం. అయితే ఎవరు రాణించినా లేదా చేతులెత్తేసినా ఒక్క ఆటగాడు మాత్రం ‘తగ్గేదేలే’ అంటున్నాడు. అతనెవరో కాదు.. మన హైదరాబాదీ కుర్రాడైన ‘తిలక్ వర్మ. అవును, బెంగళూరుతో జరిగిన మ్యాచులో 46 బంతుల్లో 84 రన్స్ చేసిన తిలక్.. చెన్నైపై 22 పరుగులు.. ఆ తర్వాత ఢిల్లీ క్యాపటల్స్‌పై 41 పరుగులు చేశాడు. అంటే ఈ ఐపీఎల్ సీజన్‌లో తను ఆడిన 3 మ్యాచ్‌లలోనే 147 పరుగులు చేశాడు.  మరో విశేషమేమిటంటే.. ఈ సీజన్‌లో ముంబై తరఫున టాప్ స్కోరర్ (147) కూడా తిలక్ వర్మనే.

ఇలా ముంబై తరఫున తనకు వచ్చిన అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకుంటున్న తిలక్‌కి తాజాగా ఓ అరుదైన గౌరవం దక్కింది. అదేమిటో తెలిస్తే ‘తిలక్ వర్మ కోసం నింగికి నిచ్చెనలు సిద్ధమవుతున్నాయ’ని అనుకుంటారు.అసలు అదేమిటంటే.. తిలక్‌ వర్మతో రిలయన్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు సంబంధించిన బ్రాండ్ ఇమేజ్ పొజిషనింగ్, ఎండార్స్‌మెంట్స్, ప్రదర్శనలు, సోషల్ మీడియా మానిటైజేషన్, లైసెన్సింగ్‌తో సహా అన్ని రకాల వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే రిలయన్స్ యాజమాన్యంలోని స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీ ‘రైజ్’ ఈ మేరకు ప్రకటన కూడా విడుదల చేసింది. అంటే ఇకపై కొన్ని రిలయన్స్ ప్రకటనల్లో తిలక్‌ వర్మ మెరవనున్నాడు.

ఇవి కూడా చదవండి

కాగా తిలక్ వర్మ కంటే ముందు ఏడుగురు క్రికెటర్లతో రిలయన్స్‌ ఒప్పదం కురుర్చుకుంది. ఇక ఈ జాబితాలో తిలక్ వర్మ ఎనిమిదో ఆటగాడు కావడం విశేషం. తిలక్ వర్మ కంటే ముందు ఎవరెవరు ఉన్నారంటే.. అంతకుముందు రోహిత్‌ శర్మ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, సూర్య కుమార్ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్ కిషన్‌, కృనాల్‌ పాండ్యా రిలయన్స్‌తో కలిసి పనిచేశారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..