Viral Video: ఐపీఎల్ 2023లో మొదలైన వివాదాలు.. హార్దిక్‌ను ఏకిపారేస్తోన్న నెజిటన్స్.. స్టేజ్‌పై ధోని కనబడలేదా అంటూ..
IPL 2023 Controversy: ఐపీఎల్ 2023 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఎంఎస్ ధోనీ, హార్దిక్ పాండ్యా వేదికపైకి వెళ్లారు. ట్రోఫీతో వేదికపైకి చేరుకున్న పాండ్యా.. ధోనీతో కరచాలనం చేయకుండానే పక్కన నిల్చున్న అరుణ్ ధుమాల్‌తో షేక్ హ్యాండ్ చేస్తూ ముందుకు సాగాడు.

ఐపీఎల్ 2023 ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ జట్టు ఎంఎస్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌కు ముందు ప్రారంభ వేడుకలు నిర్వహించారు. వేడుక ముగింపులో గుజరాత్, చెన్నై రెండు జట్ల కెప్టెన్లను వేదికపైకి పిలిచారు. అయితే, ముందుగా చెన్నై సారథి ధోని వేదికపైకి చేరుకున్నాడు. ఆ తర్వాత పాండ్యా ట్రోఫీతో వేదికపైకి చేరుకున్నాడు. ఈక్రమంలో పాండ్యా బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జైషా, ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్‌లతో కరచాలనం చేశాడు. దీంతో సోషల్ మీడియాలో పాండ్యాపై ఫ్యాన్స్ కోపం ప్రదర్శించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
వేదికపై మొదట్లోనే ధోనీ నిల్చుని ఉన్నాడు. ఐపీఎల్ ట్రోఫీతో వేదికపైకి చేరుకున్న పాండ్యా.. ధోనీ తర్వాత నిలబడిన అరుణ్ ధుమాల్ ముందు కరచాలనం చేశాడు. ఆ తర్వాత జై షా రోజర్ బిన్నీతో కరచాలనం చేశాడు. పాండ్యా వైఖరిని నెటిజన్లు ఏమాత్రం ఇష్టపడడం లేదు.




వీడియో ఇక్కడ చూడండి..
same on u hardik pandya #ipol2023 pic.twitter.com/KjdXSW1zns
— Lokesh pandat (@LokeshS30714400) March 31, 2023
పాండ్యా వైఖరిని అభిమానులు ఏకిపారేస్తున్నారు. అయితే స్టేజ్ దిగిన తర్వాత పాండ్యా, ధోనీల మధ్య అద్భుతమైన స్నేహబంధం కనిపించింది. టాస్ సమయంలో పాండ్యా చేతులు కలపడమేకాక.. చెన్నై కెప్టెన్‌పై ప్రశంసలు కురిపించాడు. టాస్ సమయంలో, ధోనీ అంటే ఏమిటో పాండ్యా మరోసారి ప్రపంచానికి చెప్పుకొచ్చాడు.
భారత్‌లోని ప్రతి ఒక్కరికీ ధోనీ ప్రేరణ అని గుజరాత్ కెప్టెన్ పాండ్యా అన్నాడు. ఆటగాడిగా, ఇప్పుడు కెప్టెన్‌గా ధోనీ ప్రభావం తనపై ఉందని పాండ్యా చెప్పుకొచ్చాడు. అయితే ఈ మ్యాచ్‌లో ధోని సేనపై పాండ్యా టీం 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..