రాజస్థాన్‌పై వార్నర్ తన ఐపీఎల్ కెరీర్‌లో 57వ అర్ధ సెంచరీని నమోదు చేశాడు. అతని పేరు మీద 4 సెంచరీలు కూడా ఉన్నాయి. 44 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. ఢిల్లీ తరపున వార్నర్ ఒంటరి పోరాటం చేశాడు. ఢిల్లీ తరఫున, వార్నర్ ఈ మ్యాచ్‌లో పోరాడడమే కాకుండా, గత రెండు మ్యాచ్‌లలో కూడా అతని బ్యాట్ నుంచి పరుగుల వర్షం కురుస్తోంది.