IPL 2023 CSK Captain: చెన్నై ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆర్‌సీబీతో మ్యాచ్‌కు ధోని అన్‌ఫిట్.. కెప్టెన్‌గా ఎవరంటే?
CSK vs RCB: చివరి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లక్నో సూపర్ జెయింట్‌తో చివరి బంతికి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అదే సమయంలో రాజస్థాన్ రాయల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
MS Dhoni Injury Update: చివరి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లక్నో సూపర్ జెయింట్‌తో చివరి బంతికి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అదే సమయంలో రాజస్థాన్ రాయల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే, ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఏప్రిల్ 17న ముఖాముఖిగా తలపడనున్నాయి. బెంగుళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. అయితే చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు శుభవార్త మాత్రం అందడంలేదనే తెలుస్తోంది. మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడగలడా లేదా అనేది ప్రస్తుతానికి స్పష్టంగా తెలియలేదు.
మహేంద్ర సింగ్ ధోని స్థానంలో సీఎస్‌కే కెప్టెన్‌గా ఎవరు?
చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు గాయపడడం ఆ జట్టుకు ఇబ్బందిగా మారింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ ఆడలేకపోతే జట్టును ఎవరు నడిపిస్తారు? అంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బెన్ స్టోక్స్ కూడా గాయపడ్డాడు. రాజస్థాన్ రాయల్స్‌పై ఓటమి తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. మా జట్టులోని చాలా మంది ఆటగాళ్లు గాయపడ్డారు. మహేంద్ర సింగ్ ధోనీతో పాటు జట్టులోని చాలా మంది ఆటగాళ్లు గాయంతో బాధపడుతున్నారని చెప్పుకొచ్చాడు. అయితే, మహేంద్ర సింగ్ ధోనీ రాబోయే మ్యాచ్‌లలో కనిపిస్తాడా లేదా అనే దానిపై స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా మొయిన్ అలీ?
మహేంద్ర సింగ్ ధోనీతో పాటు దీపక్ చాహర్, సిసంద మగల, సిమ్రంజిత్ సింగ్ వంటి ఆటగాళ్లు గాయపడ్డారు. అయితే కెప్టెన్ కూల్ గైర్హాజరీలో జట్టును ఎవరు నడిపిస్తారన్నది అతిపెద్ద ప్రశ్న? అని తెలుస్తోంది. నిజానికి, మహేంద్ర సింగ్ ధోనీ ఆడకపోతే రితురాజ్ గైక్వాడ్ లేదా బెన్ స్టోక్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉండవచ్చని అనుకున్నారు. అయితే ఈ పరిస్థితిలో మొయిన్ అలీ చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే, చెన్నై సూపర్ కింగ్స్ ఏ ఆటగాడికి ఛాన్స్ ఇవ్వనుందో చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..