AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: ఆయన నాకు అన్నయ్య లాంటివాడు.. మా ఇద్దరి మధ్య ఎలాంటి పోటీ లేదు..!

IPL 2022: ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో ఢిల్లీ విజయకేతనం ఎగరేసింది.

IPL 2022: ఆయన నాకు అన్నయ్య లాంటివాడు.. మా ఇద్దరి మధ్య ఎలాంటి పోటీ లేదు..!
Kuldeep
uppula Raju
|

Updated on: Apr 29, 2022 | 8:46 AM

Share

IPL 2022: ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో ఢిల్లీ విజయకేతనం ఎగరేసింది. దీంతో పాయింట్ల పట్టికలో ముందుకు దూసుకెళ్లింది. అయితే ఢిల్లీ విజయంలో లెఫ్టార్మ్ మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కీలకపాత్ర పోషించాడు. మూడు ఓవర్లలో 14 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. తాను ఇప్పుడు మానసికంగా బలమైన బౌలర్‌గా మారానని, వైఫల్యానికి భయపడనని చెప్పాడు. స్పిన్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ తనకి తనకు మద్దతు ఇచ్చాడని ఈ స్టార్‌ని తన అన్నగా భావిస్తున్నట్లు చెప్పాడు. ఈ ఏడాది పర్పుల్ క్యాప్ చాహల్ పేరులోనే ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ముందుగా బ్యాటింగ్‌ చేసిన KKR తొమ్మిది వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా ఢిల్లీ 19 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసి విజయం సాధించింది.

కుల్దీప్ చాలా కాలంగా పేలవమైన ఫామ్‌తో పోరాడుతున్నాడు. అయితే మ్యా్‌చ్‌ అనంతరం కొన్ని ముఖ్యమైన విషయాల గురిచి ప్రస్తావించాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న తన సహచరుడు యుజ్వేంద్ర చాహల్‌కి తనకి ఎలాంటి పోటీ లేదని, ఆయన నన్ను నిరంతరం ప్రోత్సహించేవారని గుర్తుచేసుకున్నాడు. అతను తనకి అన్నయ్య లాంటివాడని, తాను గాయపడినప్పుడు ఆదరించాడని చెప్పాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ.. రెండు పరుగుల తేడాతో మూడు వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్‌పై ఆశలు వదులుకున్నట్లు తెలిపాడు. కానీ జట్టు చివరకి విజయం సాధించడంతో సంతోషంగా ఉందన్నాడు.

మరిన్ని ఐపీఎల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Electric Scooters: ఈ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లకి పెరుగుతున్న డిమాండ్.. పెరిగిన ఇంధన ధరలకి ప్రత్యామ్నాయం..!

Cricket Photos: ఈ దిగ్గజ ఆటగాడు 140 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరేవాడు.. ఈ రోజు ఆయన పుట్టినరోజు..

Salmonellosis: అమెరికా, యూరప్‌లో విస్తరిస్తున్న సాల్మోనెలోసిస్.. జాగ్రత్తగా లేకపోతే అంతే సంగతులు..!