IPL 2022 Auction: తగ్గేదేలే.! మెగా వేలంలో దుమ్ములేపిన యువ ప్లేయర్స్.. సీనియర్లకు నిరాశ..

Full List of Players, IPL 2022 Auction: ఐపీఎల్ 2022 మెగా వేలంలో రసవత్తరంగా సాగుతోంది. పలు సంచలనాలు నమోదనప్పటికీ.. మరే ఆశ్చర్యాలు చోటు చేసుకోలేదు.

IPL 2022 Auction: తగ్గేదేలే.! మెగా వేలంలో దుమ్ములేపిన యువ ప్లేయర్స్.. సీనియర్లకు నిరాశ..
Ipl
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 12, 2022 | 11:22 PM

ఐపీఎల్ 2022 మెగా వేలం రసవత్తరంగా సాగింది. పలు సంచలనాలు నమోదనప్పటికీ.. మరే ఆశ్చర్యాలు చోటు చేసుకోలేదు. ఫ్రాంచైజీలు అందరూ కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆటగాళ్లను ఎంపిక చేశారు. వేలంలో యువ ప్లేయర్స్ అత్యధిక ధరకు అమ్ముడయ్యారు. పలువురు సీనియర్లకు నిరాశే మిగిలింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ మెగా ఆక్షన్ మధ్యలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. వేలాన్ని నిర్వహించే హ్యూ ఎడ్మీడ్స్ డయాస్ వద్ద కుప్పకూలిపోగా..ఆడిటోరియంలో ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే ఆ తర్వాత ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పడంతో అంతా సద్దుమణిగింది. హ్యూ ఎడ్మిడ్స్‌ స్థానంలో చారు శర్మ మిగతా సగం వేలాన్ని పూర్తి చేశారు.

ఐపీఎల్ మెగా వేలంలో కీ పాయింట్స్:

  1. ఈ వేలంలో మొదటి ప్లేయర్‌గా శిఖర్ ధావన్ రూ. 8.25 కోట్లకు పంజాబ్ కింగ్స్‌కు అమ్ముడుపోగా.. రెండో ప్లేయర్‌గా అశ్విన్ రూ. 5 కోట్లకు రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. మూడో ప్లేయర్‌గా ప్యాట్ కమ్మిన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు రూ. 7.25 కోట్లకు, నాలుగో ప్లేయర్‌గా కసిగో రబాడ పంజాబ్ కింగ్స్‌కు రూ. 9.25 కోట్లకు అమ్ముడుపోయారు.
  2. ఇక ఆ తర్వాత ట్రెంట్ బౌల్ట్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.8 కోట్లకు దక్కించుకుంది. శ్రేయాస్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్‌ రూ. 12.25 కోట్లకు దక్కించుకుంది. రూ. 6.25 కోట్లకు మహమ్మద్ షమీని గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాఫ్ డుప్లెసిస్‌ను ఫ్రాంచైజీ రూ. 7 కోట్లకు కొనుగోలు చేసింది. లక్నో టీం డికాక్‌ను రూ.6.75 కోట్లతో దక్కించుకుంది. డేవిడ్ వార్నర్‌ను రూ. 6.25 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.
  3. మనీష్ పాండే రూ. 4.60 కోట్లకు లక్నో జెయింట్స్, హెట్‌మెయిర్ రూ.8.50 కోట్లకు రాజస్తాన్ రాయల్స్, ఊతప్పను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 2 కోట్లకు, గుజరాత్ టైటాన్స్ జాసన్ రాయ్‌ను రూ. 2 కోట్లకు దక్కించుకుంది. పడిక్కల్‌ను రూ. 7.75 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. బ్రావోను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 4.4 కోట్లకు దక్కించుకోగా.. నితీష్ రానా రూ. 8 కోట్లకు కేకేఆర్ దక్కించుకుంది. జాసన్ హోల్డర్ రూ. 8.75 కోట్లకు లక్నో జట్టు అమ్ముడుపోయాడు.
  4. హర్షల్ పటేల్‌ను ఆర్సీబీ రూ. 10.75 కోట్లకు తిరిగి దక్కించుకుంది. దీపక్ హుడాను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 5.75 కోట్లకు దక్కించుకుంది. హసరంగాను రూ. 10.75 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది. వాషింగ్టన్ సుందర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 8.75 కోట్లకు కొనుగోలు చేసింది. కృనాల్ పాండ్యాను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 8.25 కోట్లకు కొనుగోలు చేసింది. మిచిల్ మార్ష్ ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 6.5 కోట్లకు దక్కించుకుంది.
  5. అంబటి రాయుడిని చెన్నై సూపర్ కింగ్స్ రూ. 6.75 కోట్లు పెట్టి దక్కించుకుంది. ఇక ఇషాన్ కిషన్ ఈ వేలంలో ఇప్పటివరకు అమ్ముడైన క్రికెటర్లలో అత్యధిక ధర పలికిన క్రికెటర్‌గా నిలిచాడు. ముంబై ఇండియన్స్ రూ. 15.25 కోట్లకు ఇషాన్ కిషన్‌ను కొనుగోలు చేసింది. జానీ బెయిర్‌స్టోను పంజాబ్ కింగ్స్ రూ. 6.75 కోట్లకు దక్కించుకుంది. వికెట్ కీపర్ దినేష్ కార్తీక్‌ను రూ. 5.5 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. నికోలస్ పూరన్‌ను రూ. 10.75 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది.  ప్రియం గర్గ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 20 లక్షలకు దక్కించుకుంది. అభినవ్ సదరంగనిని రూ.2.60 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. దేవల్ద్ బ్రేవిస్‌ను ముంబై ఇండియన్స్ రూ. 3 కోట్లకు దక్కించుకుంది. అశ్విన్ హెబ్బార్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. రాహుల్ త్రిపాఠిని హైదరాబాద్ జట్టు రూ. 8.50 కోట్లకు దక్కించుకుంది.
  6. ఆల్‌రౌండర్ల కోటాలో రియాన్ పరాగ్‌ను రూ. 3.80 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. అభిషేక్ శర్మను రూ. 6.50 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 20 లక్షలకు సర్ఫరాజ్ ఖాన్‌ను దక్కించుకుంది. షారుఖ్ ఖాన్ రూ. 9 కోట్లకు పంజాబ్ కింగ్స్‌కు అమ్ముడుపోయాడు. శివమ్ మావిని రూ. 7.25 కోట్లకు కేకేఆర్ సొంతం చేసుకుంది. రాహుల్ తేవాటీయాను గుజరాత్ టైటాన్స్ రూ. 9 కోట్లకు కొనుగోలు చేసింది. కమలేశ్ నాగరకోటిని ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 1.10 కోటికి దక్కించుకుంది. పంజాబ్ కింగ్స్ రూ. 3.80 కోట్లకు హర్‌ప్రీత్ బ్రర్‌ను దక్కించుకుంది. షాబాజ్ అహ్మద్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 2.40 కోట్లకు, ఢిల్లీ క్యాపిటల్స్ కెఎస్ భరత్‌ను రూ. 2 కోట్లకు సొంతం చేసుకుంది. అంజు రావత్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 3.40 కోట్లకు, ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ను రూ. 60 లక్షలకు పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.60 లక్షలకు షెల్డన్ జాక్సన్‌ను దక్కించుకుంది. జితేష్ శర్మను పంజాబ్ కింగ్స్ రూ. 20 లక్షలు పెట్టి సొంతం చేసుకుంది.
  7. అన్‌క్యాప్ద్ ఫాస్ట్ బౌలర్ల కోటాలో బసిల్ తంపిని ముంబై ఇండియన్స్ రూ.30 లక్షలకు దక్కించుకుంది. కార్తీక్ త్యాగిని హైదరాబాద్ జట్టు రూ. 4 కోట్లకు, ఆకాష్ దీప్‌ను రూ. 20 లక్షలకు బెంగళూరు, కెఎం ఆసిఫ్‌ను రూ. 20 లక్షలకు చెన్నై, ఆవేశ్ ఖాన్‌ను రూ. 10 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్, ఇషాన్ పోరెల్‌ను పంజాబ్ కింగ్స్ రూ. 25 లక్షలకు, తుషార్ దేశ్‌పాండేను రూ. 20 లక్షలకు చెన్నై. అంకిత్ సింగ్ రాజ్‌పుత్‌ను రూ. 50 లక్షలకు లక్నో జట్టు సొంతం చేసుకుంది. ఇక నూర్ అహ్మద్‌ను రూ. 30 లక్షలకు గుజరాత్ టైటాన్స్‌ దక్కించుకుంది. మురుగన్ అశ్విన్‌ను రూ.1.60 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. కెసి కరియప్పాను రూ. 30 లక్షలకు రాజస్థాన్ రాయల్స్, శ్రేయాస్ గోపాల్‌ను రూ.75 లక్షలకు సన్‌రైజర్స్ హైదరాబాద్, జగదీషా సుచిత్‌ను రూ. 20 లక్షలకు హైదరాబాద్, సాయి కిషోర్‌ను రూ. 3 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకున్నాయి.
  8. బౌలర్ల కోటాలో టి. నటరాజన్ రూ. 4 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ చెంతకు మరోసారి చేరగా.. దీపక్ చాహార్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 14 కోట్లకు దక్కించుకుంది. ప్రసిద్ద్ కృష్ణను రాజస్థాన్ రాయల్స్ రూ.10 కోట్లకు కొనుగోలు చేసింది. గుజరాత్ టైటాన్స్ ఫెర్గుసన్‌ను రూ. 10 కోట్లకు సొంతం చేసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 7.75 కోట్లకు జోష్ హజిల్‌వుడ్‌ను దక్కించుకుంది. మార్క్ వుడ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 7.5 కోట్లకు కొనుగోలు చేసింది. భువనేశ్వర్ కుమార్‌ను రూ. 4.20 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. కుల్దీప్ యాదవ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 2 కోట్లకు సొంతం చేసుకుంది. రాహుల్ చాహార్‌ను పంజాబ్ కింగ్స్ రూ. 5.25 కోట్లకు దక్కించుకుంది. రాజస్తాన్ రాయల్స్ యుజ్వేంద్ర చాహల్‌ను రూ. 6.5 కోట్లకు కొనుగోలు చేసింది.
  9. అన్‌క్యాప్ద్ ఫాస్ట్ బౌలర్ల కోటాలో బసిల్ తంపిని ముంబై ఇండియన్స్ రూ.30 లక్షలకు దక్కించుకుంది. కార్తీక్ త్యాగిని హైదరాబాద్ జట్టు రూ. 4 కోట్లకు, ఆకాష్ దీప్‌ను రూ. 20 లక్షలకు బెంగళూరు, కెఎం ఆసిఫ్‌ను రూ. 20 లక్షలకు చెన్నై, ఆవేశ్ ఖాన్‌ను రూ. 10 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్, ఇషాన్ పోరెల్‌ను పంజాబ్ కింగ్స్ రూ. 25 లక్షలకు, తుషార్ దేశ్‌పాండేను రూ. 20 లక్షలకు చెన్నై. అంకిత్ సింగ్ రాజ్‌పుత్‌ను రూ. 50 లక్షలకు లక్నో జట్టు సొంతం చేసుకుంది. ఇక నూర్ అహ్మద్‌ను రూ. 30 లక్షలకు గుజరాత్ టైటాన్స్‌ దక్కించుకుంది. మురుగన్ అశ్విన్‌ను రూ.1.60 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. కెసి కరియప్పాను రూ. 30 లక్షలకు రాజస్థాన్ రాయల్స్, శ్రేయాస్ గోపాల్‌ను రూ.75 లక్షలకు సన్‌రైజర్స్ హైదరాబాద్, జగదీషా సుచిత్‌ను రూ. 20 లక్షలకు హైదరాబాద్, సాయి కిషోర్‌ను రూ. 3 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకున్నాయి.
  10. మొదటి రోజు వేలంలో డేవిడ్ మిల్లర్, సందీప్ లెమిచాన్, సురేష్ రైనా, స్టీవ్ స్మిత్, మహమ్మద్ నబీ, మ్యాథ్యూ వేడ్‌, వృద్దిమాన్ సాహా, సామ్ బిలింగ్స్, ఉమేష్ యాదవ్, అమిత్ మిశ్రా, ముజీబ్ జద్రాన్, ఆదిల్ రషీద్, ఎం. సిద్ధార్థ్, ఆడమ్ జంపా, ఎన్. జగదీషన్, హరి నిశాంత్, ఇమ్రాన్ తాహిర్, మొహమ్మద్ అజారుద్దీన్, విష్ణు వినోద్, విష్ణు సోలంకి, అన్మోల్ ప్రీత్ సింగ్, రజిత్ పటిదర్, షకిబుల్ హసన్‌లు అన్‌సోల్డ్ ప్లేయర్‌లుగా మిగిలిపోయారు. మరి ఆ తర్వాత అయినా వీరిని ఫ్రాంచైజీలు తీసుకుంటాయో.? లేదో అన్నది వేచి చూడాలి.
  11. కాగా, నాలుగేళ్ల విరామం తరువాత భారీ సంఖ్యలో జరుగుతున్న ఈ మెగా వేలంలో 590 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తొలి రోజు 97 ఆటగాళ్లు వేలంలోకి వచ్చారు. రెండు రోజులు పాటు బెంగళూరు వేదికగా ఈ వేలం జరుగుతుంది.