IPL 2021: ఇంగ్లండ్ ఆటగాళ్ల ప్రవర్తనతో అయోమయంలో ఫ్రాంచైజీలు.. బీసీసీఐకి ఫిర్యాదు
ఐపీఎల్ జట్లతో ఇంగ్లండ్ ఆటగాళ్లు చేసుకున్న ఒప్పందాన్ని వారు ఉల్లంఘించారు. ఇంగ్లండ్ ఆటగాళ్ల ఇలాంటి ప్రవర్తనతో ఫ్రాంచైజీలు బీసీసీఐకి ఫిర్యాదు చేశాయి.
IPL 2021: మరో ఏడు రోజుల్లో ఐపీఎల్ 2021 రెండో దశ ప్రారంభం కానుంది. భారతదేశంలో అసంపూర్తిగా మిగిలిపోయిన మ్యాచులను యూఏఈలో పూర్తి చేసేందుకు బీసీసీఐ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 19 నుంచి చెన్నై వర్సెస్ ముంబై మ్యాచుతో ఈ పోరు మొదలుకానుంది. ఇదంతా ఒకవైపు అయితే, ఇంగ్లండ్ ఆటగాళ్ల ప్రవర్తనతో ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా ఫ్రాంచైజీల నుంచి ఆంగ్ల ఆటగాళ్లు ఐపీఎల్ 2021 రెండవ దశ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఐపీఎల్ జట్లతో అతను చేసుకున్న ఒప్పందం రద్దయింది. ఇంగ్లండ్ ఆటగాళ్ల ఈ ప్రవర్తనకు సంబంధించి ఐపీఎల్ జట్లు బిసీసీఐకి ఫిర్యాదు చేశాయి.
జానీ బెయిర్‌స్టో, క్రిస్ వోక్స్, డేవిడ్ మలాన్ ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు శనివారం ప్రకటించారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు మూడు ఐపీఎల్ జట్లు.. సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్‌లో భాగంగా ఉన్నారు. ఫ్రాంఛైజీకి సంబంధించిన ఒక అధికారి ఇన్‌సైడ్‌స్పోర్ట్.కోతో మాట్లాడుతూ, చివరి నిమిషంలో ఆటగాళ్లు టోర్నమెంట్ నుంచి వైదొలగడం పట్ల ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్యకు సంబంధించి ఫ్రాంఛైజీలు బీసీసీఐకి లేఖ రాశాయి అని అన్నారు.
ఇంగ్లండ్ ఆటగాళ్ల ప్రవర్తనతో ఫ్రాంచైజీల ఆగ్రహం ఆంగ్ల ఆటగాళ్లు లీగ్ నుంచి తప్పుకోవడం వల్ల నష్టపోయిన ఫ్రాంచైజీలతో సంబంధం ఉన్న ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ, “నేను గురువారం నా కాంట్రాక్ట్ ఇంగ్లండ్ ఆటగాళ్లతో మాట్లాడాను. సెప్టెంబర్ 15 నాటికి యూఏఈ చేరుకోవాలని కోరాను. శనివారం వారు రావడం లేదని మాకు తెలిపారు. వారి ప్రవర్తనతో జట్టు కోచ్, మేనేజ్‌మెంట్ అందరూ కలత చెందుతున్నారు. వారి వైఖరి మా ఒప్పందానికి విరుద్ధం. దీనికి సంబంధించి మేం బీసీసీఐకి లేఖ కూడా రాశాం అని వెల్లడించారు.
ఇప్పటివరకు 6గురు ఔట్.. జానీ బెయిర్‌స్టో, క్రిస్ వోక్స్, డేవిడ్ మలాన్ ఐపీఎల్ 2021 రెండవ దశ నుంచి తమ పేర్లను ఉపసంహరించుకోవడానికి వ్యక్తిగత కారణాలను పేర్కొన్నారు. ఈ సీజన్ నుంచి ఇప్పటివరకు 6 గురు ఆంగ్ల ఆటగాళ్లు తప్పుకున్నారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇంగ్లండ్ ఆటగాళ్ల నిష్క్రమణతో ఎక్కువగా ప్రభావితమైన జట్టుగా మిగిలింది.
విజయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు.. బోర్డు తప్పుడు నిర్ణయాలతో కెరీర్ ముగించాడు.. ఆయనెవరో తెలుసా?