AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌లో జన్మించాడు.. దక్షిణాఫ్రికా తరపున క్రికెట్ ఆడాడు.. అనంతరం బ్రిటిష్ సైన్యంతో యుద్ధం కూడా.. ఆ ప్లేయర్ ఎవరంటే?

ఆ ఆటగాడు టెస్ట్ మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. మొత్తం 11 మంది ఆటగాళ్లు ఎంట్రీ ఇచ్చిన మ్యాచులో 8 వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు.

భారత్‌లో జన్మించాడు.. దక్షిణాఫ్రికా తరపున క్రికెట్ ఆడాడు.. అనంతరం బ్రిటిష్ సైన్యంతో యుద్ధం  కూడా.. ఆ ప్లేయర్ ఎవరంటే?
Representational Image
Venkata Chari
|

Updated on: Sep 12, 2021 | 12:01 PM

Share

భారతదేశంలో జన్మించిన ఈ ఆటగాడు దక్షిణాఫ్రికా తరపున క్రికెట్ ఆడాడు. నాజర్ హుస్సేన్ ఇంగ్లండ్ తరపున క్రికెట్ ఆడినట్లే.. రాబర్ట్ స్టీవర్ట్ దక్షిణాఫ్రికా తరపున ఆడాడు. ఈ ఇద్దరూ భారత దేశంలోనే పుట్టారు. అయితే, నాసిర్ హుస్సేన్ జన్మించనప్పుడు, రాబర్ట్ స్టీవర్ట్ మరణించాడు. 1913 సంవత్సరంలో ఈరోజు అంటే సెప్టెంబర్ 12, రాబర్ట్ స్టీవర్ట్ ప్రపంచంతో తన సంబంధాలను తెంచుకున్నాడు. అతని క్రికెట్ జీవితం, బ్రిటీష్ సైన్యంలో అతని పాత్ర ఇలా ఎన్నో జ్ఞాపకాలు ఇంకా మిగిలే ఉన్నాయి.

రాబర్ట్ స్టీవర్ట్ బ్రిటిష్ ఇండియాలోని అజమ్‌గఢ్‌లో జన్మించారు. అతని చదువులు ఇంగ్లండ్‌లోనే పూర్తి చేశాడు. ఆపై, అతను దక్షిణాఫ్రికాలోని బ్రిటిష్ సైన్యంలో చేరాడు. సైన్యంలో మేజర్‌గా నియామకం అయిన రాబర్ట్ స్టీవర్ట్ క్రికెట్‌పై ఆసక్తి కలిగి ఉండేవాడు. దీంతో స్థానిక టోర్నమెంట్లలో పాల్గొనడం ప్రారంభించాడు. 1879-80లో, అతను పోర్ట్ ఎలిజబెత్ జట్టుతో ఒక మ్యాచ్ ఆడాడు, అందులో అతను టాప్ స్కోరర్. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు 1888-89లో దక్షిణాఫ్రికాలో పర్యటించింది. ఈ పర్యటనలో, తూర్పు ప్రావిన్స్ నుంచి ఇంగ్లీష్ జట్టుతో స్టీవర్ట్ మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో డబుల్ ఫిగర్ చేరుకున్న అతికొద్ది మంది బ్యాట్స్‌మెన్లలో స్టీవర్ట్ ఒకరు.

దక్షిణాఫ్రికా తరపున ఒక టెస్ట్ మాత్రమే.. ఇంగ్లండ్ జట్టుతో ఆడిన కొన్ని రోజుల తర్వాత, రాబర్ట్ స్టీవర్ట్ ఆ టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఇది దక్షిణాఫ్రికా మొదటి ఫస్ట్ క్లాస్ టెస్ట్ మ్యాచ్. అప్పుడే టెస్ట్ హోదాను పొందింది. ఈ మ్యాచ్‌లో ఆడిన మొత్తం 11 మంది ఆటగాళ్లు టెస్ట్ అరంగేట్రం చేశారు. ఈ మ్యాచ్‌లో స్టీవర్ట్ 8 వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. అతను మొదటి ఇన్నింగ్స్‌లో 4 పరుగులు, రెండవ ఇన్నింగ్స్‌లో 9 పరుగులు చేశాడు. అయితే, ఈ మొదటి టెస్ట్ స్టీవర్ట్‌కు చివరి టెస్ట్ కూడా అయింది.

సేవలకు ఎన్నో పతకాలు.. బ్రిటిష్ ఆర్మీలో మేజర్ హోదాలో ఉన్న రాబర్ట్ స్టీవర్ట్, యుద్ధాలలో ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు ఎన్నో పతకాలు కూడా అందుకున్నారు. బ్రిటిష్ సైన్యం కోసం రెండవ బోయర్ యుద్ధంలో పోరాడాడు. ఈ పోరాటంలో చూపిన ధైర్యం, నైపుణ్యాలతో స్టీవర్ట్ 4 నక్షత్రాలతో క్వీన్ దక్షిణాఫ్రికా పతకాన్ని, 2 నక్షత్రాలతో కింగ్ దక్షిణాఫ్రికా పతకాన్ని అందుకున్నారు.

Also Read:

విజయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు.. బోర్డు తప్పుడు నిర్ణయాలతో కెరీర్ ముగించాడు.. ఆయనెవరో తెలుసా?

CPL 2021: 39 బంతుల్లో ఊచకోత.. 7 సిక్సులు, 4 ఫోర్లతో ప్రత్యర్థికి చుక్కలు చూపించిన పంజాజ్ కింగ్స్ ప్లేయర్