విజయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు.. బోర్డు తప్పుడు నిర్ణయాలతో కెరీర్ ముగించాడు.. ఆయనెవరో తెలుసా?

Nathan Bracken: క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత, ఆ ఆటగాడు రాజకీయాల్లో తన లక్‌ను ప్రయత్నించాడు. 2013 సంవత్సరంలో సెంట్రల్ కోస్ట్ సీటు నుంచి స్వతంత్రంగా పోటీ చేశాడు.

విజయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు.. బోర్డు తప్పుడు నిర్ణయాలతో కెరీర్ ముగించాడు.. ఆయనెవరో తెలుసా?
Nathan Bracken

Nathan Bracken: ఒక క్రికెటర్ పిచ్‌పైకి వచ్చినప్పుడు అతను సాధించిన విజయాల గురించి ఆలోచిస్తాడు. వాటి నుంచి మరిన్ని విజయాలను ఎలా పొందాలో నేర్చుకుంటాడు. తమ కెరీర్‌లో దాదాపు పూర్తి విజయాలు సాధించగలిగే వారు చాలా తక్కువ. ఈ విషయంలో ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ నాథన్ బ్రాకెన్ కాస్త అదృష్టవంతుడు. అతను ప్రపంచ కప్ గెలిచిన జట్టులో ఒక భాగం. అతని హయాంలో ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్ అనే బిరుదును కూడా సాధించాడు. ఐసీసీ బౌలర్ల వన్డే, టీ 20 ర్యాంకింగ్స్‌లో అతను నంబర్ వన్ అయ్యాడు. 434 పరుగుల వరల్డ్ రికార్డు టార్గెట్ ఛేజ్‌లో, దక్షిణాఫ్రికా తరఫున బ్రాకెన్ 5 వికెట్లు పడగొట్టాడు. కానీ, నాథన్ బ్రాకెన్ వాస్తవికత కొద్దిగా భిన్నంగా ఉంది. నిన్నమొన్నటి వరకు బ్యాట్స్‌మెన్‌లను ముప్పతిప్పలు పెట్టిన బ్రాకెన్.. క్రికెట్ ఆస్ట్రేలియా తరపున ఘనంగా రాణించాడు.

ఈరోజు ఆయన పుట్టినరోజు. నాథన్ బ్రాకెన్ 1977 సంవత్సరంలో, అంటే ఈ రోజు సెప్టెంబర్‌12 న జన్మించాడు. 6 అడుగుల 5 అంగుళాల పొడవు గల ఎడమ చేతి ఫాస్ట్ బౌలర్‌గా మారిన బ్రాకెన్.. రెండు వైపుల నుంచి బంతులను స్వింగ్ చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాడు. మూడు ఫార్మాట్లలో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాడు. నాథన్ బ్రాకెన్ 2001 లో వెస్టిండీస్‌తో ఒక వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. రెండు సంవత్సరాల తరువాత, అతని టెస్ట్ అరంగేట్రం భారతదేశంపై జరిగింది.

బ్రాకెన్ క్రికెట్ గ్రాఫ్
నాథన్ బ్రాకెన్ టెస్ట్ కెరీర్ కేవలం 2 సంవత్సరాలు మాత్రమే కొనసాగింది. ఇందులో అతను 5 టెస్టులు ఆడాడు. 12 వికెట్లు తీసుకున్నాడు. కానీ, టెస్టుల్లో అతని వైఫల్యం వన్డే క్రికెట్‌ని ప్రభావితం చేయలేదు. ఈ క్రికెట్ ఫార్మాట్‌లో బాగా రాణించాడు. 2006 లోనే 46 వికెట్లు తీశాడు. నాథన్ బ్రాకెన్ తన కెరీర్‌లో మొత్తం 116 వన్డేలు ఆడాడు. 176 వికెట్లు తీసుకున్నాడు. 4 వికెట్లు 5 సార్లు, 5 వికెట్లు రెండుసార్లు పడగొట్టాడు.

మోకాలి గాయం, క్రికెట్ ఆస్ట్రేలియా తప్పుడు నిర్ణయాలతో కెరీర్ ముగింపు
2009 లో బ్రాకెన్ మోకాలి గాయంతో ఇబ్బంది పడ్డాడు. ఈ గాయం బ్రాకెన్‌కు కెరీర్-కిల్లర్‌గా మారింది. 2010 లో అతని ఒప్పందం కూడా రద్దయింది. ఆపై 28 జనవరి 2011 న, బ్రాకెన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. మరుసటి సంవత్సరం అంటే 9 ఫిబ్రవరి 2012 న, అతను క్రికెట్ ఆస్ట్రేలియాపై చట్టపరమైన చర్యలు చేపట్టాడు. ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డ్ సానుకూలంగా స్పందించి ఉంటే అతని మోకాలి గాయం తీవ్రమయ్యేది కాదు. దీంతోనే ఆస్ట్రేలియా బోర్డుపై తిరుగుబాటు చేశాడు. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత, నాథన్ బ్రాకెన్ రాజకీయాల్లో తన లక్‌ను ప్రయత్నించాడు. అతను 2013వ సంవత్సరంలో సెంట్రల్ కోస్ట్ స్థానం నుంచి స్వతంత్రంగా ఎన్నికల్లో పోటీ చేశాడు.

Also Read:

CPL 2021: 39 బంతుల్లో ఊచకోత.. 7 సిక్సులు, 4 ఫోర్లతో ప్రత్యర్థికి చుక్కలు చూపించిన పంజాజ్ కింగ్స్ ప్లేయర్

ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు.. 20 బంతుల్లో 102 రన్స్.. మొత్తంగా 16 సిక్సర్లతో పరుగుల సునామీ!

Click on your DTH Provider to Add TV9 Telugu