CPL 2021: 39 బంతుల్లో ఊచకోత.. 7 సిక్సులు, 4 ఫోర్లతో ప్రత్యర్థికి చుక్కలు చూపించిన పంజాజ్ కింగ్స్ ప్లేయర్
Punjab Kings: కేవలం 64 నిమిషాల్లో 39 బంతులను ఎదుర్కొని అజేయంగా 75 పరుగులు చేశాడు. 192.30 స్ట్రైక్ రేట్‌లో 4 ఫోర్లు మాత్రమే ఉన్నాయి. కానీ, సిక్సర్ల సంఖ్య మాత్రం 7గా నమోదైంది.
IPL 2021: ఐపీఎల్ 2021 తేదీలు దగ్గరపడుతున్నాయి. ఈమేరకు అన్ని టీంలు సన్నాహాలు మొదలుపెట్టాయి. అయితే ఇప్పటికే కొన్ని లీగ్‌లలో ఆడుతున్న ఆటగాళ్లు.. సత్తా చాటుతూ ప్రాంఛైజీలకు నమ్మకం కలిపిస్తున్నారు. వెస్టిండీస్‌లో జరుగుతోన్న కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో కొందరు ఆటగాళ్లు.. అద్భుతమైన ఆటతో ఆకట్టుకుని ఐపీఎల్‌లో సత్తా చాటేందుకు సిగ్నల్ అందిస్తున్నారు. అలాగే మరికొందరు బంతితో విధ్వంసం సృష్టిస్తున్నారు. కొందరు బ్యాట్‌తో సాటిలేని ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నారు. ఐపీఎల్ 2021 రెండవ దశకు ముందు పూర్తి రూపాన్ని ప్రదర్శిస్తున్న పంజాబ్ కింగ్స్ ప్లేయర్ నికోలస్ పూరన్.. రిచ్ లీగ్‌లో బరిలోకి దిగేందుకు రెడీ అయ్యాడు. ఐపీఎల్ 2021 లో, నికోలస్ పూరన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగనున్నాడు. సీపీఎల్ 2021 లో కెప్టెన్‌గా రాణిస్తున్నాడు. వేగంగా పరుగులు సాధించి తన జట్టు ఓటమిని తప్పించాడు. జమైకా తలైవాస్‌పై గయానా వారియర్స్ జరిగిన మ్యాచులో కెప్టెన్ చేసిన విధ్వంసాన్ని ఓసారి చూద్దాం..
ఈ మ్యాచ్‌లో, తొలుత బ్యాటింగ్ చేసిన గయానా వారియర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. గయానాను ఈ స్కోర్‌కి తీసుకెళ్లడంలో ఆటీం కెప్టెన్ నికోలస్ పూరన్ పాత్ర చాలా కీలకమైంది. పూరన్ బ్యాటింగ్ చేయడానికి క్రీజులోకి వచ్చి 64 నిమిషాల పాటు బ్యాటింగ్ చేశాడు. వేగంగా పరుగులు సాధించి, స్కోరు బోర్డును ఆమాంతం పెంచేశాడు. పూరన్ ముందు, జమైకన్ బౌలర్ బాస్ తుకూర్ ఓడిపోయాడు.
39 బంతుల్లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్.. నికోలస్ పూరన్ 64 నిమిషాల్లో 39 బంతులను ఎదుర్కొని అజేయంగా 75 పరుగులు చేశాడు. 192.30 స్ట్రైక్ రేట్‌లో ఆడిన ఈ ఇన్నింగ్స్‌లో కేవలం 4 ఫోర్లు మాత్రమే ఉన్నాయి. కానీ, సిక్సర్ల సంఖ్య మాత్రం 7గా నమోదయ్యాయి. అంటే తన 75 పరుగుల ఇన్నింగ్స్‌లో పూరన్ 11 బంతుల్లో కేవలం ఫోర్లు, సిక్సర్లతోనే 58 పరుగులు సాధించాడు. ఇదే రెండు జట్ల మధ్య పెద్ద వ్యత్యాసాన్ని పెంచింది. అనంతరం 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక జమైకా జట్టు పరాజయం పాలైంది.
Also Read: ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు.. 20 బంతుల్లో 102 రన్స్.. మొత్తంగా 16 సిక్సర్లతో పరుగుల సునామీ!